Advertisementt

పుష్పరాజ్ ట్రైలర్ రిలీజ్

Wed 10th Aug 2022 05:32 PM
pushparaj movie,pushparaj movie trailer,druva sarja  పుష్పరాజ్ ట్రైలర్ రిలీజ్
Pushparaj Movie Trailer Release పుష్పరాజ్ ట్రైలర్ రిలీజ్
Advertisement
Ads by CJ

ధ్రువ సర్జా, రచిత రామ్ హరిప్రియ జంటగా కన్నడ లో రూపొందిన పుష్పరాజ్ ది సోల్జర్ చిత్రాన్ని ఆర్. యస్ ప్రొడక్షన్స్ ఆర్. శ్రీనివాస్ నిర్మాణ సారద్యంలో గ్రీన్ మెట్రో మూవీస్, వాణి వెంకట్రామా సినిమాస్ పతాకాలపై బొడ్డు అశోక్, కె. రవీంద్ర కళ్యాణ్ లు సంయుక్తంగా తెలుగులోకి అనువదిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 27న గ్రాండ్ గా రిలీజ్ కు సిద్దమైంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో చిత్ర ఆడియోను ఘనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన నిర్మాత రామ సత్యనారాయణ,ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ లు ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో మూవీ మాక్స్ ఆధినేత శ్రీనివాస్, దర్శకుడు సూర్య కిరణ్, ఆదిత్య, తిరుపతి రెడ్డి, పుప్పా అంకంబరావు, రేణుక గారు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.ట్రైలర్ విడుదల కార్యక్రమం అనంతరం

చిత్ర నిర్మాత బొడ్డు అశోక్ మాట్లాడుతూ.. మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదములు. క్రేజీ అంకుల్స్ తరువాత మేము తీసిన స్ట్రెయిట్ ఫిలిం "గోల్డ్ మ్యాన్" 10 డేస్ షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. మేము విడుదల చేస్తున్న ఈ సినిమా విషయానికి వస్తే ఈ క్రెడిట్ అంతా రవీంద్ర కళ్యాణ్ కే చెందుతుంది.ఎందుకంటే తనే అన్నీ దగ్గరుండి చూసుకున్నాడు.మూవీ మాక్స్ ద్వారా పుష్పరాజ్ సినిమాను విడుదల చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.తను రీసెంట్ గా విడుదల చేసిన మయోన్ సినిమా గొప్ప విజయం సాధించింది. తిరుపతి రెడ్డి గారి సినిమా తీస్ మార్ ఖాన్ కూడా బిగ్ హిట్ అవ్వాలి శ్రీహరి నాకు క్లాస్ మెట్ తనతో నేను ట్రావెల్ చేశాను. తను ఎక్కడున్నా మమ్మల్ని ఆశీర్వాదిస్తాడని ఆశిస్తున్నాను.

ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. రియల్ ఎస్టేట్ లో సక్సెస్ అయి సినిమా రంగంలో కూడా సక్సెస్ అవ్వాలని సినిమాలు తీస్తున్న వ్యక్తి బొడ్డు అశోక్, ఎక్కడైతే క్రేజీ సినిమాలు ఉన్నాయో.. ఏ సినిమాలు అయితే గ్యారెంటీ గా ఆడతాయని అనుకుంటాడో దాన్ని దృక్పని లాగా అంటే ఆయస్కాంతంలా వెతుక్కుంటూ వెళ్ళిపోతాడు. ఆలా ఆయస్కాంతంలా దొరికిన ఈ సినిమా మంచి సినిమాలా కనిపిస్తుంది. వీరిద్దరూ కలసి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న పుష్పరాజ్ టైటిల్ చూస్తుంటే చార్లెస్ శోభరాజ్, అల్లు అర్జున్ సినిమాలు గుర్తుకు వస్తాయి. కమర్సియల్ గా చూసుకుంటే ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. ఇదే హీరో తెలుగులో చేసిన పొగరు సినిమా కూడా బాగా ఆడింది. హీరో ధ్రువ సర్జా ను చూస్తుంటే అర్జున్ గారు వయసులో ఉన్నప్పుడు మా పల్లెలో గోపాలుడు టైమ్ లో ఎలా ఉండేవాడో ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఆలాగే ఉన్నాడు. కౌన్సిల్ లో యాడ్స్ వేసినా, టైటిల్ రిజిస్టర్ చేసినా,పబ్లిసిటీ క్లీయరెన్స్, సెన్సార్ కంప్లీట్ చేసుకున్నా హిట్ అవుతుంది అనే నమ్మకం ఏర్పడింది అన్నారు.

అతిధిగా వచ్చిన దర్శకుడు సూర్య కిరణ్ మాట్లాడుతూ.. కన్నడలో సూపర్ హిట్ అయ్యి ఎంతో పేరు తెచ్చుకున్న ఈ సినిమా తెలుగులో కూడా అంతే విజయం సాదించి మా నిర్మాతలకు మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

మరో నిర్మాత రవీంద్ర కళ్యాణ్ మాట్లాడుతూ.. మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదములు. ఈ సినిమాను ఆర్. యస్ ప్రొడక్షన్స్ ఆర్. శ్రీనివాస్,గ్రీన్ మెట్రో మూవీస్, వాణి వెంకట్రామా సినిమాస్ పతాకాలపై బొడ్డు అశోక్ గారితో కలసి తెలుగులో విడుదల చేస్తున్నాము.మూవీ మాక్స్ ద్వారా పుష్పరాజ్ సినిమాను విడుదల చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.తను రీసెంట్ గా విడుదల చేసిన మయోన్ సినిమా గొప్ప విజయం సాధించింది.ఈ నెల 27 న గ్రాండ్ గా విడుదల అవుతున్న మా పుష్పరాజ్ సినిమాను అందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

రామ సత్యనారాయణ మాట్లాడుతూ.. ఈ సినిమా పుష్పరాజ్ అనే టైటిల్ లోనే 50% మార్కులు కొట్టేసింది. ఎందుకంటే సూపర్ హిట్ అయిన టైటిల్ ను ఈ సినిమాకు పెట్టడం వలన ప్రజల్లోకి ఈజీగా వెళుతుంది. ట్రైలర్ చూస్తుంటే చాలా ఎక్సట్రార్దినరీ ఉంది. ఇది డబ్బింగ్ సినిమాలా కాకుండా స్ట్రెయిట్ సినిమా అనిపించేలా ఉంది. కన్నడలో ఈ సినిమా మంచి హిట్ అయ్యి 49 కోట్లు కలెక్ట్ చేసింది తెలుగులో కూడా అంతే విజయం సాదించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

నిర్మాత బొడ్డు ఆదిత్య మాట్లాడుతూ..తెలుగు ట్రైలర్ చాలా అద్భుతంగా వచ్చింది. కన్నడలో సూపర్ హిట్ అయిన పుష్పరాజ్ సినిమాను తెలుగులో డబ్ చేసే అవకాశం కల్పించిన రవీంద్ర కళ్యాణ్ గారికి ధన్యవాదములు.అలాగే మూవీ మాక్స్ ద్వారా మా సినిమాను విడుదల చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆగష్టు 27న థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న మా సినిమాను అందరూ ఆశీర్వదించాలి. అలాగే మా సినిమాతో పాటు రిలీజ్ అవుతున్న తిరుపతి రెడ్డి గారి సినిమా తీస్ మార్ ఖాన్ సినిమా కూడా బిగ్ హిట్ అవ్వాలని అన్నారు.

మూవీ మాక్స్ ఆధినేత శ్రీనివాస్ మాట్లాడుతూ.. సీడెడ్, వైజాగ్ ఏరియా లలో బిజినెస్ అయ్యింది. ఇంతకుముందు వచ్చిన పొగరు సినిమాలాగే ఇప్పుడు వస్తున్న "పుష్పరాజ్" సినిమా కూడా బిగ్ హిట్ అవ్వాలి అన్నారు.

రేణుక మాట్లాడుతూ.. కన్నడలో హిట్ అయినట్లే తెలుగులో కూడా పుష్పరాజ్ సినిమా బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

డైలాగ్ రైటర్ సూర్య మాట్లాడుతూ. ఇందులో డైలాగ్స్, పాటలు, ఫైట్స్ అన్నీ బాగుంటాయి..చిన్న పిల్లల దగ్గర నుండి పెద్ద వాళ్ళ వరకు అందరూ చూడవలసిన చిత్రమిది . నాకిలాంటి మంచి అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాత లకు ధన్యవాదములు

పుప్పా అంకంబరావు మాట్లాడుతూ.. బొడ్డు అశోక్, కె. రవీంద్ర కళ్యాణ్ లు సంయుక్తంగా తెలుగులోకి విడుదల చేస్తున్న పుష్పరాజ్ బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

గౌతమ్, రాహుల్, రామకృష్ణ మరియు చిత్ర యూనిట్ సభ్యులు అందరూ ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాదించాలి అన్నారు.తదితరులు

నటీ నటులు: ధ్రువ సర్జా - రచితా రామ్ హరిప్రియ తదితరులు.

Pushparaj Movie Trailer Release:

Pushparaj movie trailer release

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ