Advertisementt

ఇరు రంగాల ఇద్దరు ఉద్ధండుల కలయిక

Sun 21st Aug 2022 06:31 PM
senior journalist bhageeratha with venkayya nayudu,journlist bhageeratha book on sr.ntr  ఇరు రంగాల ఇద్దరు ఉద్ధండుల కలయిక
A Combo Of Two Legends From Both Fields ఇరు రంగాల ఇద్దరు ఉద్ధండుల కలయిక
Advertisement
Ads by CJ

గత మూడు దశాబ్దాలుగా రాజకీయ రంగంలో గళంతో కదం తొక్కిన వారు ఒకరు.

అదే గత మూడు దశాబ్దాలుగా కలంతోనే కదనం చేస్తున్నవారు మరొకరు.

ఇద్దరు ఉద్దండులు కలిశారు. కలానికి గళంతో అభినందనలు తెలిపారు. 

సీనియర్ జర్నలిస్ట్ , రచయిత భగీరథను భారత మాజీ ఉప రాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు అభినందించారు. మహానటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా రామారావుగారితో చేసిన ఇంటర్వ్యూలు, ఆయనతో వున్న అనుభవాలతో భగీరథ మహానటుడు, ప్రజా నాయకుడు - ఎన్ .టి .ఆర్ అన్న పుస్తకాన్ని వెలువరించారు. ఈ పుస్తకాన్ని ఇటీవలే వెంకయ్య నాయుడు గారిని  హైదరాబాద్ లో కలసి  బహూకరించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు గారు ఎన్ .టి .ఆర్ తో తనకున్న అనుభవాలను గుర్తు చేసుకున్నారు. సినిమా రంగంలోనూ, రాజకీయ రంగంలోనూ ఎన్.టి.ఆర్ చెరిగిపోని ముద్ర వేశారని, ఆయన ఎప్పటికీ స్ఫూర్తి ప్రదాత అని పేర్కొన్నారు.  

మహానటుడు, ప్రజానాయకుడు ఎన్.టి.ఆర్ శత జయంతి సందర్భంగా ఆయన మీద ఓ పుస్తకాన్ని వెలువరించిన సీనియర్ జర్నలిస్ట్, రచయిత భగీరధను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు అభినందించారు .

 

A Combo Of Two Legends From Both Fields:

senior journalist Bhageeratha with venkayya nayudu

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ