F3 సక్సెస్ తర్వాత విక్టరీ వెంకటేష్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ఓరి దేవుడా లో స్పెషల్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమాను అనౌన్స్ చేసిన రోజు నుంచి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ దేవుడు క్యారెక్టర్‌లో నటిస్తున్నారంటూ వార్తలు వినిపించాయి. ఈ విషయాన్ని మేకర్స్ స్టన్నింగ్ గ్లింప్స్‌తో అధికారికంగా ధృవీకరించారు. గ్లింప్స్ లోకి వెళితే వెంకటేష్ కూల్, స్టైలిష్ లుక్ లో దేవుడు క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారని అర్థమవుతుంది. చుట్టూ పుస్తకాలు.. సీతాకోక చిలుకలు మధ్య విశ్వక్ సేన్ కనిపించారు. విక్టరీ వెంకటేష్ అంటే ఓ మేనరిజమ్ ఉంటుంది. ఆ మేనరిజమ్‌తో ఆయన ఫ్యాన్స్, ప్రేక్షకులకు గ్లింప్స్ చివరలో సర్‌ప్రైజ్ ఇచ్చారు.
ఓరి దేవుడా’ దేవుడా చిత్రం షూటింగ్ పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయటం డబుల్ సర్‌ప్రైజ్. దీపావళి సందర్భంగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 21న విడుదల చేస్తున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.