Advertisementt

జర్నలిస్ట్ భగీరథను అభినందించిన చంద్రబాబు

Sat 01st Oct 2022 02:54 PM
chandrababu,bhagiratha,rambabu  జర్నలిస్ట్ భగీరథను అభినందించిన చంద్రబాబు
Chandrababu congratulates Bhagiratha జర్నలిస్ట్ భగీరథను అభినందించిన చంద్రబాబు
Advertisement
Ads by CJ

తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు  ప్రపంచంలోని తెలుగువారందరికీ స్ఫూర్తి ప్రదాతని, ఆయన నిస్వార్థ, నిరుపమాన ప్రజాసేవకుడని తెలుగు దేశం పార్టీ జాతీయ  అధ్యక్షుడు నారా చంద్ర బాబు నాయుడు చెప్పారు.  . 

ఎన్ .టి .రామారావు శత జయంతి సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ భగీరథ తాను రచించిన మహానటుడు, ప్రజా నాయకుడు -ఎన్ .టి .ఆర్ అన్న పుస్తకాన్ని  నారా చంద్ర బాబు నాయుడు గారికి బహూకరించాడు. శుక్రవారం సాయంత్రం జర్నలిస్ట్ పర్వతనేని రాంబాబు , నిర్మాత యలమంచిలి అనిల్ బాబు, రామరాజు శ్రీనివాస్ తో కలసి  భగీరథ చంద్ర బాబు నాయుడు ను మంగళగిరి లోని తెలుగు దేశం కార్యాలయంలో కలిశారు . 

ఎన్ .టి .రామారావు గారి శత జయంతి సందర్భంగా జర్నలిస్టుగా వారితో వున్న అనుబంధం, వారితో చేసిన ఇంటర్వ్యూలతో మహానటుడు , ప్రజానాయకుడు - ఎన్ .టి .ఆర్ అన్న పుస్తకాన్ని రచించిన జర్నలిస్టు, రచయిత భగీరథను చంద్ర బాబు నాయుడు అభినందించారు .   

శుక్రవారం రోజు చంద్ర బాబు నాయుడు గారి  సందర్శన కోసం ఎంతో మంది వేచి వున్నా, తమతో చాలాసేపు ఆత్మీయంగా మాట్లాడినందుకు భగీరథ, రాంబాబు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలిపారు

chandrababu,bhagiratha,rambabu

Chandrababu congratulates Bhagiratha:

Chandrababu congratulates Journalist Bhagiratha

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ