Advertisementt

యశోద పై ముగిసిన వివాదం

Tue 29th Nov 2022 03:44 PM
yashoda movie  యశోద పై ముగిసిన వివాదం
Controversy over Yashoda Movie యశోద పై ముగిసిన వివాదం
Advertisement
Ads by CJ

ఒకరిని బాధపెట్టే ఉద్దేశం మాకు లేదు.. ఈవా ఐవీఎఫ్ ఆసుపత్రితో సమస్య సమసిపోయింది -యశోద చిత్రనిర్మాత శివలెంక కృష్ణప్రసాద్.

సమంత టైటిల్ పాత్రలో హరి, హరీష్ దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన సినిమా యశోద. నవంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అద్భుతమైన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. 

ఈ సినిమాలో ఈవా పేరు ఉపయోగించడంతో హైదరాబాద్‌లో ఈవా ఐవీఎఫ్ ఆసుపత్రి వర్గాలు కోర్టుకు వెళ్ళాయి. వాళ్ళతో నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడి సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కారించారు. సినిమాలో ఈవా పేరును తొలగించినట్టు పేర్కొన్నారు. సమస్య పరిష్కారం కావడంతో ఈవా ఐవీఎఫ్ ఎండీ మోహన్ రావుతో కలిసి మంగళవారం శివలెంక కృష్ణప్రసాద్ విలేఖరుల సమావేశం నిర్వహించారు.

శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. సమంత ప్రధాన పాత్రలో మేం నిర్మించిన యశోద విజయవంతమైన సంగతి తెలిసిందే. సినిమాలో మేం సరోగసీ ఫెసిలిటీ అని చూపించాం. దానికి ఈవా అని పేరు పెట్టాం. దానికి మేం ఇచ్చిన నిర్వచనం వేరు. అయితే, హైదరాబాద్ - వరంగల్‌కు చెందిన ఈవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీ ఆసుపత్రి వారు సినిమా అనేది పవర్ ఫుల్ మీడియం కావడంతో.. యశోద లో ఈవా అని చూపించడంతో తమకు ఇబ్బంది కలుగుతుందని కోర్టు ద్వారా న్యాయం కోసం ప్రయత్నించారు. థియేటర్లలో కాకుండా ఓటీటీ వరకు ఆ పేరు వాడకూడదని కోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. మాకు ఈ విషయం తెలియదు. ఒకరిని బాధ పెట్టే ఉద్దేశం గానీ, ఇతరుల మనోభావాలను కించపరిచే ఆలోచన గానీ మాకు అసలు లేదు. అందుకని, వెంటనే ఈవా ఐవీఎఫ్ ఆసుపత్రి వర్గాలను సంప్రదించాను. సినిమా ఇండస్ట్రీ పట్ల మాకు గౌరవం ఉంది. మమ్మల్ని హర్ట్ చేసే విధంగా ఉంది. అందుకని, ఇలా చేశాం.. అని చెప్పారు. ఈవా పేరు తీసేస్తామని నేను చెబితే.. అప్పుడు తమకు ఎటువంటి అభ్యంతరం లేదని తెలిపారు. పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అందుకు గాను మీడియా ముఖంగా ఈవా ఐవీఎఫ్ యాజమాన్యానికి, ఆసుపత్రి వర్గాలకు కృతజ్ఞతలు చెబుతున్నాను. సినిమాలో ఈవా అనేదానిని తొలగించాం. భవిష్యత్తులో యశోద సినిమాలో ఎక్కడా ఈవా పేరు కనిపించదు. అయితే, థియేటర్లలో సినిమా విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. థియేటర్లలో పేరు మార్చాలంటే సెన్సార్ ద్వారా జరగాలి. ఆ తర్వాత కేడీఎంలు చేంజ్ చేయాలి. దానికి కొంత టైమ్ పడుతుంది. ఈ విషయం చెబితే.. ఈవా ఐవీఎఫ్ ఆసుపత్రి వర్గాలు అంగీకరించాయి. నేను వాళ్ళ ఆసుపత్రికి వెళ్ళాను. ఆర్గనైజ్డ్ గా చేస్తున్నారు. మంచి సర్వీస్ అందిస్తున్నారు. మాకు ఈ విషయం తెలియక పేరు వాడడంతో చిన్న డిస్టర్బెన్స్ జరిగింది. ఇప్పుడు ఆ సమస్యకు పరిష్కారం లభించింది. మేం ఇద్దరం హ్యాపీ అని చెప్పారు.

 ఈవా ఐవీఎఫ్ ఎండీ మోహన్ రావు మాట్లాడుతూ.. కొన్ని రోజుల క్రితం నేను మీడియా ముందుకు వచ్చి యశోద లో మా ఆసుపత్రి పేరు ఉపయోగించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశాను. ఆ రెండో రోజు నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ గారు మమ్మల్ని సంప్రదించారు. కోర్టు ద్వారా మేం వ్యక్తం చేసిన అభ్యంతరాల పట్ల మాతో మాట్లాడారు. ఈవా పేరు తొలగిస్తామని చెప్పారు. మాకు ఇచ్చిన మాట ప్రకారం తొలగించారు కూడా! ఆ రోజు ఐదు కోట్లకు డ్యామేజ్ సూట్ వేశారు కదా? అని కొందరు ప్రశ్నించారు. అప్పుడు కూడా చెప్పాను. డబ్బుల కోసం కేసు వేయలేదు. దాని విలువ చెప్పాలని చేశాం. ఈవా ఐవీఎఫ్ బ్రాండ్ ఇమేజ్ డ్యామేజ్ కాకుండా చూడటం మా ఉద్దేశం. అందుకే కేసు వేశాం. మొన్న సాయంత్రం నాకు సినిమా చూపించారు. అందులో ఈవా పేరుకు సంబంధించినవి అన్నీ తొలగించారు. నిన్న (సోమవారం) మళ్ళీ న్యాయస్థానం దగ్గరకు వెళ్లి.. యశోద నిర్మాత చేసిన మార్పులతో సంతృప్తిగా ఉన్నామని చెప్పాం. అలాగే, కేసును ఉపసంహరించుకుంటున్నట్టు తెలిపాం. వెంటనే కోర్టు ఆమోదించింది. ఇరు వర్గాల అంగీకారంతో కేసు విత్ డ్రా అయ్యింది. ఈ సమస్యకు ఇంత త్వరగా పరిష్కారం లభిస్తుందని నేను అనుకోలేదు. నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ గారు, ఆయన టీమ్ వెంటనే రెస్పాండ్ అయ్యారు. అందుకు చాలా సంతోషంగా ఉంది. నిర్మాతను సంప్రదిస్తే ఇంత త్వరగా పరిష్కారం లభిస్తుందని నాకు తెలియదు. అందుకే, చట్టబద్ధంగా కోర్టుకు వెళ్లాను. సినిమాలో చూపించిన విధంగా విదేశాల్లో జరిగి ఉండొచ్చు. మా దగ్గర ఎలా ఉంటుందనేది ఆసుపత్రికి నిర్మాతను తీసుకువెళ్లి చూపించాం. బయట ఎక్కడా సినిమాలో చూపించినట్టు జరగదు.. అని చెప్పారు.

Controversy over Yashoda Movie:

Yashoda Movie Producers Press meet

Tags:   YASHODA MOVIE
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ