Advertisementt

డ్రామెడీ జానర్ లో కార్తికేయ బెదురులంక 2012

Wed 30th Nov 2022 11:41 AM
kartikeya,neha shetty,bedurulanka 2012 first look  డ్రామెడీ జానర్ లో కార్తికేయ బెదురులంక 2012
Kartikeya Bedurulanka 2012 First Look out! డ్రామెడీ జానర్ లో కార్తికేయ బెదురులంక 2012
Advertisement
Ads by CJ

కార్తికేయ హీరోగా తెరకెక్కుతున్న బెదురులంక 2012 చిత్రంలో హీరోయిన్ గా డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి  హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్నారు. లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 3గా రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మిస్తున్నారు. నాచురల్ స్టార్ నాని ఈ రోజు బెదురులంక 2012 ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదల చేయగా సోషల్ మీడియాలో, ప్రేక్షకుల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ లభిస్తోంది. వినూత్నంగా ఉందని పలువురు ప్రశంసిస్తున్నారు.    

ఈ సందర్భంగా చిత్రనిర్మాత బెన్నీ ముప్పానేని మాట్లాడుతూ మోషన్ పోస్టర్ చూస్తే బెదురులంక 2012 ఎంత విభిన్నంగా ఉండబోతుందనేది అర్థం అవుతుంది. ఒక పల్లెటూరిలో 2012 యుగాంతం నేపథ్యంలో జరిగే కథతో తీసిన చిత్రమిది. అవుట్ అండ్ అవుట్ ఫన్ ఎంటర్‌టైనర్. కార్తికేయ, నేహా శెట్టి కాంబినేషన్ చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. డీజే టిల్లు తర్వాత నేహా నటిస్తున్న చిత్రమిది. షూటింగ్ చివరి దశకు చేరుకుంది. యానాం, కాకినాడ, గోదావరి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేశాం. ఇందులో ఐదు పాటలు ఉన్నాయి. మెలోడీ బ్రహ్మ మణిశర్మ గారు అద్భుతమైన బాణీలు అందించారు. ఓ పాటను స్వర్గీయ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాశారు. కెమెరా వర్క్ సూపర్ అంటారంతా! ఆర్ట్ వర్క్ కూడా ఫెంటాస్టిక్‌గా ఉంటుంది. డ్రామా, కామెడీ, యాక్షన్, ఎమోషన్స్ సినిమాలో మెయిన్ హైలైట్స్ అవుతాయి. థియేటర్లలో ప్రేక్షకులను బెదురులంక అనే కొత్త ప్రపంచంలోకి సినిమా తీసుకెళ్తుంది. కొత్త కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని కొత్త ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అని చెప్పారు.

దర్శకుడు క్లాక్స్ మాట్లాడుతూ డ్రామెడీ (డ్రామా ప్లస్ కామెడీ) జానర్ చిత్రమిది. ఈ సినిమాలో కొత్త కార్తికేయ కనిపిస్తారు. ఒక ఊరు నేపథ్యంలో వినోదం, మానవ భావోద్వేగాలతో కూడిన కథతో సినిమా రూపొందిస్తున్నాం. ఇందులో స్ట్రాంగ్ కంటెంట్ ఉంది. అలాగే, కడుపుబ్బా నవ్వించే వినోదం ఉంది" అని చెప్పారు.  

Kartikeya Bedurulanka 2012 First Look out!:

Kartikeya, Neha Shetty exciting next Bedurulanka 2012 First Look out!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ