కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న నిఖిల్ సిద్దార్థ్ & అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న 18పేజిస్ చిత్రం విడుదలకు సిద్దమవుతుంది. ఈ చిత్రానికి పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కథను అందించారు. ఆయన శిష్యుడు కుమారి 21ఎఫ్ చిత్ర దర్శకుడు సూర్యప్రతాప్ పల్నాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర ప్రొమోషనల్ కంటెంట్ సినిమాపై రోజురోజుకు ఆసక్తిని పెంచుతుంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేసింది చిత్ర బృందం.
ట్రైలర్ ఒక కొత్త అనుభూతిని క్రియేట్ చేస్తుంది. అద్భుతమైన విజువల్స్ తో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ మధ్య కెమిస్ట్రీని అందంగా చూపించారు ట్రైలర్ లో. కేవలం ఇద్దరి ప్రేమికులు మధ్య జరిగే ఫీలింగ్స్ మాత్రమే కాకుండా, ఈ సినిమాలో ఆసక్తికరమైన సంఘటనలను ట్రైలర్ లో చూపించారు. ప్రేమించడానికి రీజన్ ఉండకూడదు,ఎందుకు ప్రేమిస్తున్నం అంటే ఆన్సర్ ఉండకూడదు లాంటి డైలాగ్స్ ఈ ట్రైలర్ లో ఆకట్టుకుంటున్నాయి.
18 పేజెస్ చిత్రంలోని ఇప్పటికే రిలీజైన పాటలన్నిటికి మంచి స్పందన లభించగా ఇప్పుడు రిలీజైన ట్రైలర్ ఈ సినిమాపై ఇంకా అంచనాలను పెంచుతుంది. ఈ సినిమాకి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. డిసెంబర్ 23 న క్రిస్టమస్ కానుకగా ఈ సినిమాను విడుదలచేయనున్నారు.