మెగాస్టార్ చిరంజీవి-బాబీ కొల్లి కలయికలో తెరకెక్కుతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ వాల్తేరు వీరయ్య అభిమానులకు, మాస్ ప్రేక్షకులకి కు చాలా ప్రత్యేకమైన చిత్రం కానుంది. బాబీ స్వయంగా మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని కావడం, అభిమానులకు కావాల్సిన అంశాలన్నీ సమపాళ్ళలో అందించి చిత్రాన్ని పర్ఫెక్ట్ ఫుల్ మీల్ ఫీస్ట్ రెడీ చేస్తున్నాడు.
ఫుల్ మీల్ ఫీస్ట్‌కి ముందు, మేకర్స్ సినిమా నుండి పోస్టర్‌లు, గ్లింప్స్, లిరికల్ వీడియోలను విడుదల చేస్తూ చిన్న చిన్న ట్రీట్‌లతో ప్రేక్షకులని సర్ ప్రైజ్ చేస్తున్నారు. స్పెషల్లీ రవితేజ కేరెక్టర్ టీజర్ అన్ని ఆడియన్స్ కి మెచ్చేలా ఉన్నాయి. ఇక ఈ రోజు సోమవారం థర్డ్ సింగిల్ వాల్తేరు వీరయ్య టైటిల్ ట్రాక్ ని విడుదల చేశారు.
ఇది ఎక్స్ టార్డినరీ అడిక్టివ్ నంబర్. వాల్తేరు వీరయ్య టైటిల్ ట్రాక్ అన్ని వర్గాల మ్యూజిక్ లవర్స్, ముఖ్యంగా మాస్ ని మెస్మరైజ్ చేసే ఇన్స్టెంట్ హిట్. చంద్రబోస్ రాసిన ప్రతి పదం ఉరుములా వుంది. బలమైన లిరిక్స్ తో పవర్ ఫుల్ తుఫానును సృష్టిస్తుంది. వాల్తేరు వీరయ్య పరాక్రమాన్ని వీరోచితం ప్రజంట్ చేస్తోంది. ఈ మధ్య కాలంలో వచ్చిన బెస్ట్ టైటిల్ సాంగ్, హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ఇదే. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన కంపోజిషన్‌తో బ్రాస్ ఆర్కెస్ట్రా సెక్షన్ బ్యాంకాక్ మ్యుజిషియన్స్ తో రికార్డ్ చేశారు. అనురాగ్ కులకర్ణి ఎనర్జిటిక్ గా పాడారు.
ఆల్బమ్‌లోని బాస్ పార్టీ, నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి ఇప్పటికే చార్ట్‌బస్టర్‌లుగా నిలిచాయి. ఇప్పుడు ఈ సినిమా టైటిల్ ట్రాక్ అన్ని రికార్డులను బద్దలు కొట్టబోతోంది.