Advertisementt

నాని-మృణాల్ ఠాకూర్ ఫిక్స్

Sun 01st Jan 2023 05:49 PM
nani,mrunal thakur,nani30  నాని-మృణాల్ ఠాకూర్ ఫిక్స్
Nani30 Unveiled నాని-మృణాల్ ఠాకూర్ ఫిక్స్
Advertisement
Ads by CJ

న్యూ ఇయర్ సందర్భంగా మేకర్స్ #Nani30 వరల్డ్ ని ఆవిష్కరిస్తూ ఒక వీడియోను విడుదల చేసారు. నాని ఒక భవనం పైన కూర్చుని ఫోటోలు క్లిక్ చేస్తూ తన తదుపరి ప్రాజెక్ట్ గురించి తన ఆన్-స్క్రీన్ కుమార్తెతో చర్చిస్తున్నట్లు  ఈ స్పెషల్ వీడియో చూపిస్తుంది. దసరా చిత్రానికి పెంచిన మీసాలతో పాటు గడ్డం కూడా షేవ్ చేస్తానని అంటున్నాడు నాని. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో కూడిన ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉంటుందని, తండ్రీకూతుళ్ల బాండింగ్ యూఎస్‌పీగా ఉండబోతోందని ఈ స్పెషల్ వీడియో చూస్తే అర్ధమౌతోంది.  

ఈ గ్లింప్స్ దర్శకుడితో సహా చిత్రానికి సంబంధించిన ప్రధాన సాంకేతిక నిపుణులను ప్రకటించారు. నూతన దర్శకుడు  శౌర్యువ్ తొలిసారిగా మెగాఫోన్‌ను పట్టుకుని, చిన్న వీడియోతో భావోద్వేగానికి గురిచేశాడు. సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మృణాల్ ఠాకూర్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుంది.

ఈ చిత్రంలో కొంతమంది ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. సాను జాన్ వర్గీస్ ISC డీవోపీగా పని చేస్తున్నారు. జెర్సీ, శ్యామ్‌ సింగరాయ్ తర్వాత నానితో ఇది అతనికి మూడవ చిత్రం. సినిమాటోగ్రాఫర్ ఎమోషన్స్ అద్భుతంగా ఆవిష్కరించాడు.

Nani30 Unveiled:

The World Of Natural Star Nani, Mrunal Thakur, Shouryuv, Vyra Entertainments Production No 1 (Nani30) Unveiled

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ