వాల్తేరు వీరయ్య చిత్రం కోసం టీం అందరితో కలసి సమిష్టి కృషి చేస్తూ బ్లాక్ బస్టర్ అయ్యి తీరుతుందనే నమ్మకంతో పనిచేశాం. మేము ఏదైతే అనుకున్నామో అది నెరవేరిన తర్వాత ఒక్కసారిగా మాటలు కొరవడిపోయాయి. ఈ సమయంలో మేము మాట్లాడటం ఆపేసి ప్రేక్షకులు చెబితే వినాలని మనస్పూర్తిగా అనిపిస్తుంది. ప్రేక్షకుల స్పందననే మా ఇంధనం. అదే మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఒక సినిమా అద్భుతంగా వస్తుందంటే దానికి కారణం ఆ సినిమాకి పని చేసే కార్మికులు. వాల్తేరు వీరయ్య విజయం సినిమాకు పని చేసిన కార్మికులది. ఇందులో పని చేసిన అందరికీ పేరుపేరున కృతజ్ఞతలు, అభినందనలు. రవితేజ, బాబీ, దేవిశ్రీ, నిర్మాతలు రవి, నవీన్ , మిగతా నటీనటులు ఇలాంటి అద్భుతమైన టీమ్ తో కలసి పని చేయడం చాలా ఆనందంగా వుంది.
వాల్తేరు వీరయ్య విజయం సమిష్టి కృషి. సినిమా ఇంత గ్రాండ్ గా చేయడం మైత్రీ మూవీ మేకర్స్ వలనే సాధ్యమైయింది. మైత్రీ మూవీ మేకర్స్ లాంటి నిర్మాతలు దొరకడం నా అదృష్టం. వారితో మళ్ళీ కలసి పని చేయాలని వుంది. దర్శకుడు బాబీ ఈ కథని అద్భుతంగా మలిచారు. అనుభవం తో ఏదైనా సూచన చెబితే.. దాని ఒక సవాల్ గా తీసుకొని ఎక్స్ ట్రార్డినరీ వర్క్ చేశాడు. ఇది అందమైన స్క్రీన్ ప్లే. యంగ్ స్టర్స్ దీనిని ఒక కేస్ స్టడీలా చూడాలి. బాబీ సినిమా మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకూ సరిగ్గా నిద్రపోలేదు. సినిమాని చాలా ప్లానింగ్ తో పర్ఫెక్ట్ గా తీశాడు. అందుకే నిర్మాతలకు ఎలాంటి భారం లేకుండా సజావుగా సాగింది. ఈ రోజు అందరు దర్శకులు విజయం ఇవ్వడం కంటే నిర్మాత బడ్జెట్ కి సినిమా తీయడం మొదటి సక్సెస్ గా భావించాలి. దర్శకులే నిర్మాతలని బ్రతికించాలి. పక్కా పేపర్ వర్క్ చేయాలి. నిర్మాతలు ఉంటేనే నటీనటులు బావుంటారు.
నా తమ్ముడు రవితేజ లేకపోతే సెకండ్ హాఫ్ లో ఇంత అందం వచ్చేది కాదు. ఇందులో గ్లిజరిన్ లేకుండానే కన్నీళ్లు వస్తున్నాయని మా డివోపీ విలన్స్ గారు అన్నారు. ఎదురుగా వున్నది నా తమ్ముడని చెప్పా. రవితేజ లేకపోతే ఆ ఎమోషన్ వచ్చేది కాదు. దేవిశ్రీ తన మ్యూజిక్ తో పూనకాలు తెప్పించాడు. ఆర్ట్ డైరెక్టర్ ఏ ఎస్ ప్రకాష్, రామ్ లక్ష్మణ్ మాస్టర్స్, ఆర్థర్ విలన్స్ అందరూ అద్భుతంగా పని చేశారు. మంచి కంటెంట్ ఇస్తే ఆదరించి ప్రేక్షకులే తిరిగి థాంక్స్ చెబుతారని వాల్తేరు వీరయ్య నిరూపించింది. ప్రేక్షకులు చెబుతున్న థాంక్స్ కి తిరిగి థాంక్స్ చెబుతున్నాం.అన్నారు