త్వరలోనే ప్రముఖ ఓటిటిలో హన్సిక పెళ్లి సీడి

Thu 19th Jan 2023 05:07 PM
disney+ hotstar,hansika  త్వరలోనే ప్రముఖ ఓటిటిలో హన్సిక పెళ్లి సీడి
HANSIKA LOVE SHAADI DRAMA త్వరలోనే ప్రముఖ ఓటిటిలో హన్సిక పెళ్లి సీడి

ఇండియన్ సినిమాల్లో అందానికీ అభినయానికి గుర్తొచ్చే ఒక పేరు హన్సిక మోత్వానీ. గత సంవత్సరం డిసెంబర్ 4 న తన స్నేహితుడు సోహెల్ ఖటూరియా ని పెళ్లి చేసుకుంటున్నట్టు నిర్ణయం తీసుకుని కోట్ల యువ హృదయాలను బద్దలుకొట్టింది హన్సిక. జైపూర్ లో ముందోట ఫోర్ట్ అండ్ పాలస్ లో ఆ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. వీళ్లిద్దరి పెళ్లి అప్పట్లో పెద్ద సంచలనం అయింది. దేశ వ్యాప్తంగా ఈ పెళ్లి గురించి పెద్ద చర్చ జరిగింది. పత్రికల్లో ఈ పెళ్లి పతాక శీర్షికలకు ఎక్కింది.

ఇప్పుడు మొట్టమొదటి సారిగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఆ సందడికి సంబంధించిన కొన్ని నేపథ్య దృశ్యాల్ని అభిమానుల కోసం అందిస్తోంది. పండగలు, డ్రామా, ఎక్సయిట్మెంట్ ల సమ్మేళనంగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రయత్నం చేస్తోంది.

హాట్ స్టార్ స్పెషల్ షో హన్సికాస్ లవ్ షాదీ డ్రామా అభిమానులకు కనువిందు చేయబోతోంది. హన్సిక తన పెళ్లి గురించి నిర్ణయం తీసుకోవడం దగ్గరనుంచి, కేవలం ఆరువారాల్లో అద్భుతంగా పెళ్లి జరగడానికి కష్టపడ్డ వెడ్డింగ్ ప్లానెర్స్, డిజైనర్లు, కుటుంబ సభ్యులు కాలానికి ఎదురీది ఎంత కష్టపడ్డారో, ఎలాంటి సవాళ్ళని ఎదుర్కొన్నారో అన్నీ నిజంగా అద్భుతమైన కథలా రాబోతున్నాయి. హన్సిక పెళ్లి సంతోషాన్ని ఆవిరి చేసే ప్రయత్నంలో పెళ్ళికి ముందు వినిపించిన ఒక స్కాండల్ గురించి హన్సిక, తన కుటుంబ సభ్యులు కూడా మాట్లాడారు. 

హన్సిక తో కలిసి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈ హోస్ట్ స్టార్ స్పెషల్ షో గురించిన ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసారు. ఎప్పుడు స్ట్రీమింగ్ మొదలయ్యేది త్వరలో ప్రకటించనున్నారు.

HANSIKA LOVE SHAADI DRAMA:

DISNEY+ HOTSTAR REVEALS THE FIRST LOOK OF HANSIKA LOVE SHAADI DRAMA