Advertisementt

మాస్ట్రో ఇళయరాజాతో చైతు కస్టడీ టీమ్

Mon 27th Feb 2023 04:42 PM
custody,naga chaitanya,maestro ilaiyaraaja  మాస్ట్రో ఇళయరాజాతో చైతు కస్టడీ టీమ్
Custody Team Meets Legendary Maestro Ilaiyaraaja మాస్ట్రో ఇళయరాజాతో చైతు కస్టడీ టీమ్
Advertisement
Ads by CJ

అక్కినేని నాగ చైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం కస్టడీ. ఈ చిత్రం ఇటివలే షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం చిత్రబృందం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.

ఇదీలావుండగా లెజెండరీ కంపోజర్ ఇసైజ్ఞాని మాస్ట్రో ఇళయరాజా రాజా లైవ్ ఇన్ కాన్సర్ట్ కోసం హైదరాబాద్‌ కి వచ్చారు. కస్టడీ యూనిట్ లెజెండ్ ఇళయరాజాను కలుసుకుని అభినందించింది.

నాగ చైతన్య ఫోటోలని పోస్ట్ చేస్తూ ఫ్యాన్ బాయ్ మూమెంట్‌ని పంచుకున్నారు. మాస్ట్రో ఇళయరాజా సర్‌ని కలవడం  గొప్ప సంతోషాన్ని ఇచ్చింది. ఆయన పాటలు వినుకుంటూ జీవితంలో చాలా ప్రయాణాలు చేశాను.  ఇప్పుడు రాజా సర్ కస్టడీ చిత్రం కోసం కంపోజ్ చేయడం చాలా అనందంగా వుంది.అన్నారు

ఈ చిత్రంలో కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. అరవింద్ స్వామి విలన్ పాత్రలో నటిస్తుండగా, ప్రియమణి పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రంలో శరత్‌కుమార్, సంపత్ రాజ్, ప్రేమ్‌జీ, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ తదితరులు నటిస్తున్నారు.కస్టడీ మే 12, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.

Custody Team Meets Legendary Maestro Ilaiyaraaja:

Custody Team Naga Chaitanya, Venkat Prabhu, Srinivasaa Chitturi, meets Maestro Ilaiyaraaja

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ