Advertisementt

దేవరకొండ-సమంత ఖుషి కొత్త డేట్

Thu 23rd Mar 2023 04:23 PM
the vijay deverakonda,samantha,kushi movie  దేవరకొండ-సమంత ఖుషి కొత్త డేట్
Kushi movie releasing on September 1st దేవరకొండ-సమంత ఖుషి కొత్త డేట్
Advertisement
Ads by CJ

డాషింగ్ హీరో విజయ్ దేవరకొండ, మోస్ట్ టాలెంటెడ్ బ్యూటీ సమంత కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమా ఖుషీ. బ్యూటీఫుల్ లవ్ స్టోరీస్ తో సెన్సిబుల్ మూవీ మేకర్ గా పేరు తెచ్చుకున్న శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. నిన్ను కోరి, మజిలీ వంటి అందమైన సకుటుంబ ప్రేమ కథల్ని తెరకెక్కించిన శివ నిర్వాణ మరోసారి సిల్వర్ స్క్రీన్ పై తనదైన మ్యాజిక్ చేయబోతున్నారు. గతంలో మహానటి చిత్రంలో విజయ్, సమంత కలిసి నటించారు. ఖుషీతో ఈ ఇద్దరూ జంటగా పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్ రాబోతోంది. 

మజిలీ చిత్రం తరువాత శివ నిర్వాణ డైరెక్షన్ లో సమంత నటిస్తుండటం విశేషం. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో విజయ్ డియర్ కామ్రేడ్ వంటి డిఫరెంట్ అటెంప్ట్ చేశారు. ఈ సంస్థలో మరోసారి హీరోగా నటిస్తున్నారు. రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ తరువాత సమంత మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో నటిస్తోంది. క్రేజీ కాంబినేషన్ గా కంప్లీట్ పాజిటివ్ వైబ్స్ లో తెరకెక్కుతోన్న ఖుషీ చిత్ర రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేసింది టీమ్. గతంలో గత ఏడాది డిసెంబర్ లో విడుదల అన్న మేకర్స్.. సమంత అనారోగ్య కారణాలతో పోస్ట్ పోన్ చేసింది. ఇప్పుడు తాజాగా సెప్టెంబర్ 1న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ విడుదల చేయబోతున్నారు. 

కశ్మీర్ తో పాటు ఎన్నో అందరమైన లొకేషన్స్ లో చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రంతో విజయ్ దేవరకొండ - సమంత కాంబినేషన్ ప్రతి ఒక్కరి హృదయానికి హత్తుకునేలా దర్శకుడు తీర్చి దిద్దుతున్నారు. మిడ్ మాన్ సూన్ లో రెండు భిన్నమైన నేపథ్యాల మధ్య రాబోతోన్న ఈ కథ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. 

Kushi movie releasing on September 1st:

Vijay Deverakonda, Samantha Kushi movie releasing on September 1st,2023 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ