యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య, లీడింగ్ ఫిల్మ్ మేకర్ వెంకట్ ప్రభు ల తెలుగు-తమిళ ద్విభాషా ప్రాజెక్ట్ కస్టడీ మోస్ట్ ఎవైటెడ్ మూవీస్‌లో ఒకటి. మేకర్స్ ఇప్పటివరకు ఫస్ట్ లుక్, క్యారెక్టర్ పోస్టర్ లు, టీజర్, ఫస్ట్ సింగిల్.. ప్రతి ప్రమోషనల్ మెటీరియల్ తో అలరించారు. ఇప్పుడు చాలా ప్రత్యేకమైన పాట- టైమ్‌లెస్ లవ్ విడుదలైయింది.
ఈ రెట్రో థీమ్ మెలోడీని మాస్ట్రో ఇళయరాజా స్వరపరిచగా యువన్ శంకర్ రాజా అరెంజ్ చేశారు. ఈ సంగీత ద్వయం ఇన్‌స్ట్రుమెంటేషన్‌తో పాటకు వింటేజ్ వైబ్‌లను తీసుకొచ్చారు. ఇందులో లవ్లీ సాక్సోఫోన్, ఫ్లూట్, ట్రంపెట్, ట్రోంబోన్ బిట్‌లు సంగీత ప్రియులని అలరిస్తున్నాయి. యువన్ శంకర్ రాజా, కపిల్ కపిలన్ ఈ పాటని చాలా అద్భుతంగా ఆలపించారు. వింటేజ్ టచ్ ఇచ్చేలా ఏడు భారీ, వైబ్రెంట్ సెట్స్‌లో పాటని చిత్రీకరించారు. నాగ చైతన్య తన ఆరో తరగతి నుండి తన ప్రేమ కథను వివరించాడు. చై, కృతి శెట్టి ఛార్మింగా కనిపించారు. వారి బ్యూటీఫుల్ కెమిస్ట్రీ తో విజువల్స్ మరింత ఆకర్షణీయంగా కనిపించాయి. ఈ టైమ్‌లెస్ ట్రాక్ ఖచ్చితంగా వైరలై బ్లాక్ బస్టర్ అవుతుంది.
శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై భారీ నిర్మాణ విలువలు, సాంకేతిక ప్రమాణాలతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ని పవన్‌కుమార్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్‌ఆర్ కతీర్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ చిత్రానికి రాజీవ్ ప్రొడక్షన్ డిజైనర్, డివై సత్యనారాయణ ఆర్ట్ డైరెక్టర్. సమ్మర్ కానుకగా మే 12న భారీగా విడుదల కానుంది.
నాగ చైతన్య, కృతి శెట్టి, అరవింద్ స్వామి, ప్రియమణి, శరత్ కుమార్, సంపత్ రాజ్, ప్రేమి అమరేన్, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ తదితరులు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకట్ ప్రభు, నిర్మాత: శ్రీనివాస చిట్టూరి.