Advertisementt

భోళా శంకర్ భారీ ఇంటర్వెల్ సీక్వెన్స్

Thu 27th Apr 2023 05:36 PM
chiranjeevi,bholaa shankar  భోళా శంకర్ భారీ ఇంటర్వెల్ సీక్వెన్స్
Bholaa Shankar Huge Interval Sequence Shoot Underway భోళా శంకర్ భారీ ఇంటర్వెల్ సీక్వెన్స్
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేష్ ల క్రేజీ ప్రాజెక్ట్ భోళా శంకర్. ఈ మెగా మాసివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ 2023 క్రేజీయస్ట్ ప్రాజెక్ట్‌లలో ఒకటి. నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

ప్రస్తుతం, మెగాస్టార్ చిరంజీవి, షావర్ అలీ, వజ్ర & ఫైటర్స్, ఇతర ప్రముఖ తారాగణం షూటింగ్‌లో పాల్గొంటున్న భారీ ఇంటర్వెల్ సీక్వెన్స్ హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నారు. కాగా, మేకర్స్ పూజా కార్యక్రమాలతో డబ్బింగ్ పనులు ఈరోజు ప్రారంభించారు. జూన్ చివరి నాటికి భోళా శంకర్ షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లో ఎమోషన్స్, ఎంటర్‌టైన్‌మెంట్ & యాక్షన్‌తో పాటు లావిష్ గా షూట్ చేసిన పాటలు ఉంటాయి.

మెహర్ రమేష్ ఈ చిత్రంలో చిరంజీవిని పూర్తి స్టైలిష్ మాస్ అవతార్‌లో ప్రజంట్ చేస్తున్నారు. ప్రమోషనల్ కంటెంట్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. తమన్నా కథానాయికగా నటిస్తుండగా, కీర్తి సురేష్, చిరంజీవి సిస్టర్ గా కనిపించనుంది. టాలెంటెడ్ యాక్టర్ సుశాంత్ ఈ సినిమాలో లవర్ బాయ్ పాత్రలో నటిస్తున్నాడు.

ఆగస్ట్ 15 (మంగళవారం) స్వాతంత్ర్య దినోత్సవం హాలిడే లాంగ్ వీకెండ్‌ కలిసోచ్చేలా భోళా శంకర్ ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఆగస్ట్ 22న మెగా స్టార్ పుట్టినరోజు.

 

Bholaa Shankar Huge Interval Sequence Shoot Underway:

Chiranjeevi Bholaa Shankar Huge Interval Sequence Shoot Underway, Dubbing Begins  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ