మెగా ఫామిలీ నుంచి ఫస్ట్ లేడీ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది కొణెదల నిహారిక. హీరోయిన్ గానూ సపోర్ట్ యాక్ట్రెస్ గాను మెప్పించిన నిహారిక త్వరలోనే ఒక న్యూ ఏజ్ కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్ తో రాబోతోంది. డెడ్ పిక్సెల్ అనే టైటిల్ తో రూపొందిన ఈ సిరీస్ ఈ నెల 19నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సో స్ట్రీమ్ కాబోతోంది. ఇంతకు ముందే విడుదలైన ఈ వెబ్ సిరీస్ టీజర్ కు మంచి స్పందన వచ్చింది. ఒక కొత్త కంటెంట్ తో వస్తున్నట్టుగా టీజర్ చూడగానే అర్థం అవుతోంది.
ముఖ్యంగా ఈ తరం ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని రూపొందించినట్టుగా ఉంది. ఈ సిరీస్ లో నిహారిక ఒక గేమర్ గా నటించింది. ఓ నలుగురు కుర్రాళ్ళు కలిసి ఒక కొత్త తరహా గేమ్ ను క్రియేట్ చేస్తారు. దానివల్ల వాళ్ళు పొందింది.. పోగొట్టుకుంది ఏంటి అనే కాన్సెప్ట్ తో వస్తోంది టీమ్.