Advertisementt

కస్టడీ: యాక్షన్ ప్యాక్డ్ ట్రైలర్

Fri 05th May 2023 05:28 PM
naga chaitanya,custody   కస్టడీ: యాక్షన్ ప్యాక్డ్ ట్రైలర్
Custody Trailer Review కస్టడీ: యాక్షన్ ప్యాక్డ్ ట్రైలర్
Advertisement
Ads by CJ

అక్కినేని నాగ చైతన్య-వెంకట్ ప్రభు తెలుగు-తమిళ ద్విభాషా ప్రాజెక్ట్ కస్టడీ మే 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఇప్పటివరకు విడుదలైన టీజర్, పాటలు ప్రోమోలు మంచి అంచనాలను నెలకొల్పాయి. తాజాగా థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ట్రైల‌ర్ సినిమా కథాంశంపై క్యురియాసిటీని పెంచుతోంది. హీరో, విలన్ ని రక్షించడం, అతనిని చనిపోనివ్వకుండా చేయడం కథాంశం యూనిక్ గా, ఉత్కంఠభరితంగా వుంది. నాగ చైతన్య చట్టానికి కట్టుబడి ఉండే కానిస్టేబుల్‌గా కనిపించారు. అతని ప్రేమ సమస్యలో ఉంది. ప్రేమించిన అమ్మాయి మరొక వ్యక్తితో బలవంతంగా పెళ్లి చేయిస్తున్నారు.  ఒక నేరస్థుడిని కోర్టు ముందు హాజరుపరిచే వరకు తన ప్రత్యర్థుల నుండి కాపాడవలసి భాద్యత హీరోపై వుంది.  

సమాజంలో శక్తివంతమైన వ్యక్తులపై పోరాడే అండర్ డాగ్ పాత్రలో నాగ చైతన్య నటించాడు. ఇది అతనికి టైలర్ మేడ్ క్యారెక్టర్. చైతన్య కన్విన్సింగ్‌గా కనిపించారు. కృతి శెట్టి కథానాయికగా నటిస్తుండగా, అరవింద్ స్వామి, శరత్ కుమార్, ప్రియమణి ముఖ్య పాత్రల్లో కనిపించారు.

మాస్ట్రో ఇళయరాజా, అతని కుమారుడు యువన్ శంకర్ రాజా అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కష్టడి ట్రైలర్ కి బిగ్గెస్ట్ ఎస్సెట్. 

Custody Trailer Review:

Naga Chaitanya Custody Trailer Review

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ