Advertisementt

బ్రో నుంచి మార్కండేయులుగా సాయి ధరమ్

Tue 23rd May 2023 04:38 PM
pawan kalyan,sai dharam tej,bro  బ్రో నుంచి మార్కండేయులుగా సాయి ధరమ్
Bro: Sai Dharam Tej look revealed బ్రో నుంచి మార్కండేయులుగా సాయి ధరమ్
Advertisement
Ads by CJ

మేనమామ-మేనల్లుడు ద్వయం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ మొదటిసారి కలిసి నటిస్తున్న చిత్రం బ్రో. ఈ చిత్రానికి పి. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోనూ ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ఆ అంచనాలను రెట్టింపు చేశాయి. ఇక తాజాగా ఈ చిత్రం నుంచి సాయి ధరమ్ తేజ్ పాత్రకి సంబంధించిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ని విడుదల చేసింది చిత్ర బృందం.

బ్రో చిత్రంలో మార్క్ అలియాస్ మార్కండేయులు అనే పాత్రలో కనువిందు చేయనున్నారు సాయి ధరమ్ తేజ్. ఈరోజు(మే 23) సాయంత్రం 4:14 గంటలకు మార్క్ పాత్ర ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. తెల్ల దుస్తులు ధరించి ఫస్ట్ లుక్ లో ఎంతో అందంగా కనిపిస్తున్నారు సాయి తేజ్. మోషన్ పోస్టర్ లో గడియారాన్ని చూపిస్తూ మార్కండేయులుగా సాయి తేజ్ పాత్రను పరిచయం చేసిన తీరు ఆకట్టుకుంటోంది. బ్యాక్ గ్రౌండ్ లో బ్రోదిన జన్మలేషం.. బ్రోవగ ధర్మశేషం.. బ్రోచిన కర్మహాసం.. బ్రోదర చిద్విలాసం అనే శ్లోకం వినిపిస్తుండగా శాంతికి చిహ్నంలా తెల్ల దుస్తుల్లో సాయి తేజ పాత్రను పరిచయం చేయడం మెప్పిస్తోంది. 

మే 18న బ్రో టైటిల్ ని ప్రకటిస్తూ పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను విడుదల చేయగా అద్భుతమైన స్పందన లభించింది. కాలః త్రిగుణ సంశ్లేశం.. కాలః గమన సంకాశం.. కాలః వర్జయేత్ చారణం.. కాలః జన్మనాజాయతే జయం స్వయం శ్రియం ద్వయం.. బ్రో బ్రోదిన జన్మలేషం.. బ్రో బ్రోవగ ధర్మశేషం.. బ్రో బ్రోచిన కర్మహాసం.. బ్రో బ్రోదర చిద్విలాసం అనే శ్లోకంతో పవన్ కళ్యాణ్ పాత్రను పరిచయం చేసిన తీరు కట్టిపడేసింది. విడుదలైన కొద్ది గంటల్లోనే ఈ మోషన్ పోస్టర్ అత్యధిక వీక్షణలతో సోషల్ మీడియాలో సంచలన రికార్డులు సృష్టించింది. 

Bro: Sai Dharam Tej look revealed :

Pawan Kalyan-Sai Dharam Tej starrer Bro, directed by Samuthirakani

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ