Advertisementt

భోళా శంకర్: జామ్ జామ్ జజ్జనక ప్రోమో

Sun 09th Jul 2023 01:49 PM
bholaa shankar  భోళా శంకర్: జామ్ జామ్ జజ్జనక ప్రోమో
Bholaa Shankar 2nd Single Jam Jam Jajjanaka Promo భోళా శంకర్: జామ్ జామ్ జజ్జనక ప్రోమో
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ అవైటెడ్ మెగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ భోళా శంకర్‌. స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. మొదటి సింగిల్ చార్ట్‌బస్టర్‌గా నిలవగా, టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు మరొక ట్రీట్ రెడీ అయ్యింది.  

ఈ చిత్రం సెకండ్ సింగిల్ జామ్ జామ్ జజ్జనక జులై 11న విడుదల కానుంది. ఈ పాట ప్రోమో ఈరోజు సాయంత్రం 4:05 గంటలకు విడుదల కానుంది. పోస్టర్‌ లో చిరంజీవి సంప్రదాయ దుస్తులు ధరించి సూపర్ కూల్‌ గా కనిపిస్తున్నారు. టైటిల్, పోస్టర్ ఈ పాట మెగా డ్యాన్స్ ట్రీట్ గా ఉండబోతుందని సూచిస్తోంది. ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు.

అనిల్ సుంకర ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. డడ్లీ డీవోపీగా పని చేస్తున్నారు. సత్యానంద్ కథ పర్యవేక్షణ చేయగా తిరుపతి మామిడాల డైలాగ్స్ అందిస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. కిషోర్ గరికిపాటి ఎగ్జిక్యూటివ్ నిర్మాత.

Bholaa Shankar 2nd Single Jam Jam Jajjanaka Promo :

Bholaa Shankar 2nd Single Jam Jam Jajjanaka On July 11th

Tags:   BHOLAA SHANKAR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ