వైవిధ్యమైన సినిమాలను చేస్తూ తనదైన గుర్తింపు సంపాదించుకున్న టాలీవుడ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్. ఆయన కథానాయకుడిగా నటిస్తోన్న లేటెస్ట్ పీరియాడిక్ స్పై థ్రిల్లర్ డెవిల్. ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ ట్యాగ్ లైన్. రీసెంట్గా విడుదలైన ఈ సినిమా గ్లింప్స్‌లో హీరో పాత్ర తీరు తెన్నులు, డెవిల్ పాత్రలో తను ఒదిగిపోయిన విధానం, లుక్‌కి ఎక్స్ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై ఉన్న అంచనాలు నెక్ట్స్ రేంజ్‌కు చేరుకున్నాయి. ప్రేక్షకులు, అభిమానులు ఈ సినిమా అప్డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూడటం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో నవంబర్ 24న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నట్లు పోస్టర్ ద్వారా ప్రకటించారు.
డెవిల్ చిత్రంలో ఎవరికీ అంతు చిక్కని ఓ రహస్యాన్ని ఆయన ఛేదించే బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌గా నందమూరి కళ్యాణ్ రామ్ ఆకట్టుకోబోతున్నారు. గత ఏడాది తెలుగు సినీ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచిన బింబిసారతో మెప్పించిన కళ్యాణ్ రామ్ ఈ ఏడాది డెవిల్ తో మెప్పించటానికి రెడీ అవుతున్నారు.
రీసెంట్గా డెవిల్ హిందీ వెర్షన్ గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేయగా నెట్టింట తెగ వైరల్ అయ్యింది. సంయుక్తా మీనన్ ఇందులో కథానాయిక. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.