Advertisementt

అఫీషియల్: ఆదికేశవ పోస్టు పోన్

Fri 18th Aug 2023 04:20 PM
aadikeshava  అఫీషియల్: ఆదికేశవ పోస్టు పోన్
Aadikeshava postponed అఫీషియల్: ఆదికేశవ పోస్టు పోన్
Advertisement
Ads by CJ

మొదటి సినిమా ఉప్పెనతోనే సంచలన విజయాన్ని అందుకున్న వైష్ణవ తేజ్ ఈరోజు ఆగష్టు 18 న ఆదికేశవ అనే భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో ఆడియన్స్ ముందుకు రావాల్సి ఉంది. శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో మాస్ మూవీ ప్రియులను, యాక్షన్ ప్రియులను ఆకట్టుకోవాలని ఈ నూతన దర్శకుడు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన గ్లింప్స్, పంజా వైష్ణవ్ తేజ్‌ను మునుపెన్నడూ లేని విధంగా కొత్త అవతార్‌లో చూపించి మెప్పించింది.

ఆదికేశవలో యువ సంచలనం శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు. ఆమె చిత్ర అనే పాత్రలో సందడి చేయనున్నారు. శ్రీలీల పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్ లో ఆమె అందం, పాత్రలోని చిలిపితనం ఆకట్టుకున్నాయి. శ్రీలీలతో పాటు జాతీయ అవార్డు గ్రహీత, మలయాళ నటుడు జోజు జార్జ్, అపర్ణా దాస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఇప్పుడు ఈ సినిమా విడుదల తేదీని ఆగస్ట్ 18 నుంచి నవంబర్ 10కి వాయిదా వేస్తున్నట్లు ఆదికేశవ చిత్ర బృందం ప్రకటించింది. ఇటీవ‌లే ఆదికేశ‌వ చిత్రీకరణ ప్యారిస్‌లో జరిగింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉంది.

Aadikeshava postponed :

AADIKESHAVA will arrive on November 10th!

Tags:   AADIKESHAVA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ