Advertisementt

డైరెక్టర్ గా మారుతున్న హీరోగారబ్బాయి

Mon 28th Aug 2023 09:48 PM
jason sanjay vijay  డైరెక్టర్ గా మారుతున్న హీరోగారబ్బాయి
Lyca Productions Next directed by Jason Sanjay Vijay  డైరెక్టర్ గా మారుతున్న హీరోగారబ్బాయి
Advertisement
Ads by CJ

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ విజయ్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించే  లైకా ప్రొడక్షన్స్ నుంచి విజయ్ కొడుకు జాసన్ సంజయ్ దర్శకుడిగా ఏంటి ఇవ్వబోతున్నాడు. 

డైరెక్టర్ జాసన్ సంజయ్ విజయ్ మాట్లాడుతూ లైకా ప్రొడక్షన్స్ వంటి అగ్ర నిర్మాణ సంస్థలో నేను తొలి సినిమా చేయబోతుండటాన్ని గౌరవంగా భావిస్తున్నాను. కొత్త టాలెంట్ ఉన్న ఫిల్మ్ మేకర్స్ ఎంకరేజ్ చేసే ఓ కేంద్రంగా ఈ నిర్మాణ సంస్థ ఉంది. ఈ సంస్థకు నా స్క్రిప్ట్ నచ్చటం నాకెంతో సంతోషాన్ని కలిగించే విషయం. దాన్ని రూపొందించే క్రమంలో పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నట్లు వారు తెలియజేయటం మరింత ఆనందాన్ని కలిగిస్తోంది. సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ స్టార్స్, సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేయబోతున్నారు. ఇంత మంచి అవకాశం ఇచ్చిన సుభాస్కరన్ గారికి థాంక్స్. ఇది నాకెంతో ఎగ్జయిట్ మెంట్ తో పాటు పెద్ద బాధ్యత. ఇదే సందర్భంలో నాకెంతో సపోర్ట్ అందించిన తమిళ్ కుమరన్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నారు. 

ఈ సందర్భంగా లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ మాట్లాడుతూ సరికొత్త ఆలోచనలతో ఉన్న యంగ్ టాలెంటెడ్ పర్సన్స్ ఎప్పుడూ గేమ్ చేంజర్స్ గా ఉంటారని లైకా ప్రొడక్షన్స్ నమ్ముతుంటుంది. మా బ్యానర్ లో నెక్ట్స్ ప్రాజెక్ట్ ను జాసన్ సంజయ్ విజయ్ డైరెక్ట్ చేయబోతున్నారనే విషయాన్ని తెలియజేయటానికి సంతోషంగా ఉంది. తను చెప్పిన యూనిట్ పాయింట్ నచ్చింది. అలాగే సంజయ్ లండన్ లో స్క్రీన్ రైటింగ్ లో బి.ఎ. (హానర్స్)ను పూర్తి చేశారు. అలాగే టోరంటో ఫిల్మ్ స్కూల్ లో ఫిల్మ్ ప్రొడక్షన్ డిప్లొమాను కంప్లీట్ చేశారు. తను మా టీమ్ కి స్క్రిప్ట్ వివరించినప్పుడు మాకెంతో సంతృప్తికరంగా అనిపించింది. తను స్క్రీన్ రైటింగ్, డైరెక్షన్ లో స్పెషలైజేషన్ కోర్సులను చేయటం చాలా గొప్ప విషయం. తనకు సినిమా నిర్మాణంపై పూర్తి అవగాహన ఉంది. ప్రతీ ఫిల్మ్ మేకర్ కి ఇది ఉండాల్సిన లక్షణం. జాసన్ సంజయ్ విజయ్ తో కలిసి వర్క్ చేయటం ఓ వండర్ ఫుల్ ఎక్స్ పీరియెన్స్ అవుతుందని భావిస్తున్నాం. ఇందులో ప్రముఖ నటీనటులు, సాంతికేతిక నిపుణులు పని చేయబోతున్నారు అన్నారు. 

Lyca Productions Next directed by Jason Sanjay Vijay :

Official Announcement on Lyca Productions Next directed by Jason Sanjay Vijay 

Tags:   JASON SANJAY VIJAY
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ