Advertisementt

బాలకృష్ణ, శ్రీలీల ఇరగ్గొట్టేశారు

Wed 30th Aug 2023 04:53 PM
bhagavanth kesari  బాలకృష్ణ, శ్రీలీల ఇరగ్గొట్టేశారు
Bhagavanth Kesari 1st Single- Ganesh Anthem Promo Out Now బాలకృష్ణ, శ్రీలీల ఇరగ్గొట్టేశారు
Advertisement
Ads by CJ

ప్రీ-గణేష్ చతుర్థి వేడుకలు ప్రారంభమయ్యాయి, భగవంత్ కేసరి మేకర్స్ గణేష్ సాంగ్ పాట ప్రోమోను విడుదల చేశారు. మాస్ గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, శ్రీలీల.. బాబాయ్, అమ్మాయిగా కనిపించారు. అనిల్ రావిపూడి ప్రతి సినిమాలో ఒక యూనిక్ పాయింట్ ఉంటుంది. భగవంత్ కేసరిలో బాలకృష్ణ, శ్రీలీల బాబాయ్, అమ్మాయిగా కనిపించనున్నారు. వీరిద్దరి అనుబంధం గణేష్ సాంగ్ ప్రోమో ద్వారా రివిల్ అయ్యింది. బాలకృష్ణ,  శ్రీలీల.. వారి మధ్య అందమైన కెమిస్ట్రీని చూడటం కన్నుల పండగలా వుంది.

ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు, మాస్, తీన్మార్ నంబర్‌తో మ్యూజిక్  ప్రమోషన్‌లు ప్రారంభమయ్యాయి. ఈ పాట సెప్టెంబర్ 1న విడుదల కానుంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో  కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. జాతీయ అవార్డు-విజేత అర్జున్ రాంపాల్ ఈ చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు.

దసరా కానుకగా అక్టోబర్ 19న భగవంత్ కేసరి విడుదల కానుంది

Bhagavanth Kesari 1st Single- Ganesh Anthem Promo Out Now:

Nandamuri Balakrishna Bhagavanth Kesari 1st Single- Ganesh Anthem Promo Out Now

Tags:   BHAGAVANTH KESARI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ