Advertisementt

ఎక్స్ ట్రా - ఆర్డినరీ మ్యాన్ టీజర్

Mon 30th Oct 2023 08:24 PM
extra - ordinary man  ఎక్స్ ట్రా - ఆర్డినరీ మ్యాన్ టీజర్
EXTRA - Ordinary Man teaser out ఎక్స్ ట్రా - ఆర్డినరీ మ్యాన్ టీజర్
Advertisement
Ads by CJ

హీరో నితిన్ - హ్యాపెనింగ్ బ్యూటీ శ్రీలీల కాంబోలో రైటర్, డైరెక్టర్ వక్కంతం వంశీ తెరకెక్కిస్తున్న చిత్రం ఎక్స్ ట్రా. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా మేక‌ర్స్ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. టీజ‌ర్‌ లోకి వెళితే.. అందులో నితిన్ జూనియ‌ర్ ఆర్టిస్ట్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నార‌ని, సినిమా షూటింగ్‌కు వ‌చ్చిన వారిలో త‌నొక ఎక్స్‌ట్రా మెంబ‌ర్‌గా ఉంటారని అర్థ‌మ‌వుతోంది. వావ్ అనిపించేలా యాక్ష‌న్ సీన్స్ ఉన్నాయి. నితిన్ పాత్ర ఆస‌క్తిక‌రంగా ఉంది. యాక్ష‌న్ స‌న్నివేశాలు స్టైలిష్‌గా ఉన్నాయి. హేరిష్ జ‌య‌రాజ్ సంగీతం ఆక్ట‌టుకుంటోంది. 

బాహుబ‌లి 2 దండాల‌య్యా... పాటలో జూనియర్ ఆర్టిస్ట్‌గా క‌నిపించారు. ఇది హిలేరియ‌స్ గా ఉంది. శ్రీలీల‌తో హీరో ల‌వ్ ట్రాక్‌, తండ్రైన రావు ర‌మేష్‌తో హీరో నితిన్‌కి ఉండే సంఘ‌ర్ష‌ణ ఇవ‌న్నీ టీజ‌ర్‌లో ఉన్నాయి. వ‌క్కంతం వంశీ త‌న‌దైన ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా సినిమాను తెర‌కెక్కిస్తున్నార‌ని స్ప‌ష్ట‌మ‌వుతుంది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ 8న రిలీజ్ అవుతుంది. నితిన్ ఇప్ప‌టి వ‌ర‌కు క‌నిపించ‌ని డిఫ‌రెంట్ రోల్‌తో మెప్పించ‌నున్నారు. నితిన్ త‌న‌దైన స్టైల్లో సునాయ‌సంగా త‌న పాత్ర‌ను పోషించారు.  

రీసెంట్‌గా విడుద‌లైన డేంజ‌ర్ పిల్ల‌.. సాంగ్‌, అందులో నితిన్‌, శ్రీలీల పెర్ఫామెన్స్‌కు వ‌చ్చిన రెస్పాన్స్ అంద‌రికీ తెలిసిందే. 

EXTRA - Ordinary Man teaser out:

EXTRA - Ordinary Man teaser review

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ