Advertisementt

కన్నప్ప కోసం బాహుబలి యాక్షన్ కొరియోగ్రాఫర్

Sat 04th Nov 2023 04:08 PM
kecha khamphakdee  కన్నప్ప కోసం బాహుబలి యాక్షన్ కొరియోగ్రాఫర్
International Action director of Bahubali fame will design the action for Kannappa కన్నప్ప కోసం బాహుబలి యాక్షన్ కొరియోగ్రాఫర్
Advertisement
Ads by CJ

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో ట్రెండ్ అవుతోంది. ప్రభాస్, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ వంటి భారీ తారాగణంతో కన్నప్ప తెరకెక్కుతోంది. అలాంటి కన్నప్ప కోసం అంతర్జాతీయ యాక్షన్ కొరియోగ్రాఫర్ రంగంలోకి దిగారు. బాహుబలి, జవాన్, పొన్నియిన్ సెల్వన్ వంటి భారీ ప్రాజెక్టు‌లకు కెచా ఫైట్స్ కంపోజ్ చేశారు. ఆయన కంపోజ్ చేసిన పోరాట సన్నివేశాలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.

కన్నప్ప కోసం ఆయన కంపోజ్ చేయబోయే సీక్వెన్సులు ప్రేక్షకుల్ని సీటు అంచున కూర్చోబెట్టేస్తాయి. మంచు విష్ణు ఈ కన్నప్ప సినిమాను అంతర్జాతీయ స్థాయిలో మలుచుతున్నారు. ప్రాచీన యుద్దాలను మళ్లీ తెరపైకి తీసుకురానున్నారు. నాడు వాడిన ఆయుదాలు, నాడు జరిగిన పోరాటలు, హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌తో కన్నప్పను భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.

ప్రేక్షకులను థ్రిల్ చేసే పోరాట సన్నివేశాలెన్నో ఈ చిత్రంలో ఉన్నాయి. వాటిని కెచా అద్భుతంగా కంపోజ్ చేస్తారు. ఆయన రాకతో కన్నప్ప మరోస్థాయికి వెళ్లింది. కన్నప్ప సినిమాను చూసిన ప్రేక్షకులకు కచ్చితంగా కొత్త అనుభూతి కలుగుతుంది అంటూ కన్నప్ప టీం తెలిపింది.

థాయ్ లాండ్, హాంకాంగ్ వంటి దేశాల నుంచి 80 మంది ఫైటర్లను కూడా కన్నప్ప సెట్స్ మీదకు తీసుకువచ్చారు. వారందరితో కెచా కంపోజ్ చేసే యాక్షన్ సీక్వెన్స్‌లు మాస్టర్ పీస్‌లా ఉండబోతున్నాయి. ఈ యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేయనున్నాయి.

International Action director of Bahubali fame will design the action for Kannappa:

International Action director, Kecha Khamphakdee of Bahubali fame will design the action for Vishnu Manchu mytho-actioner Kannappa

Tags:   KECHA KHAMPHAKDEE
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ