సంక్రాంతికి రావడం పక్కా అంటూ పదే పదే డేట్ ని ప్రకటించడమే కాదు.. అందుకు అనుగుణంగా మాస్ రాజా రవితేజ ఈగల్ ప్రమోషన్స్ మొదలు పెట్టేసాడు. అందులో భాగంగానే ఈగల్ టీజర్ అంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ చేసారు. ఈరోజు సోమవారం ఈగల్ టీజర్ ని విడుదల చేసాడు.
కొండలో లావని కిందకి పిలవకు... ఊరు ఉండడు...నీ ఉనికి వుండదు అంటూ రవితేజ పవర్‌ఫుల్ వాయిస్ ఓవర్‌తో, స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ టీజర్ ఓపెన్ అయ్యింది. ప్రజలకు అపోహగా, ప్రభుత్వాలు దాచిపెట్టిన కథగా హీరో చేసే విధ్వంసాన్ని విజువల్స్ అద్భుతంగా ప్రజెంట్ చేశాయి. చివరిగా రవితేజ పవర్ ఫుల్ గా పరిచయమౌతూ డిఫరెంట్ అవతార్స్ లో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు.
కార్తీక్ ఘట్టమనేని తన అద్భుతమైన టేకింగ్‌తో డైరెక్షన్‌లో తన నైపుణ్యాన్ని చూపించారు. ప్రిమైజ్, నెరేటివ్ ప్రామెసింగ్ గా వున్నాయి. కార్తీక్, కమిల్ ప్లోకీ, కర్మ్ చావ్లాతో కలిసి క్యాప్చర్ చేసిన కెమెరా బ్లాక్‌లు అద్భుతంగా ఆకట్టుకున్నాయి. దావ్‌జాంద్ చేసిన అద్భుతమైన స్కోర్ విజువల్స్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. క్లిప్ చివరిలో రవితేజ కనిపించనప్పటికీ టీజర్ మొత్తం తన మాస్ వైబ్ ని చాటుకున్నారు. మాస్ మహారాజా డిఫరెంట్ గెటప్‌లు, షేడ్స్, ఇంటెన్స్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో అద్భుతంగా అలరించారు. అనుపమ పరమేశ్వరన్, శ్రీనివాస్ అవసరాల మధ్య సంభాషణ, నవదీప్ మాటలు రవితేజ పాత్రకు మరింత ఎలివేషన్ ఇచ్చాయి. వినయ్ రాయ్ డెడ్లీ విలన్‌గా కనిపించారు. కావ్యా థాపర్ మరో కథానాయిక కాగా, మధుబాల కీలక పాత్రలో కనిపించనుంది.
కార్తీక్ గడ్డంనేని రచన, దర్శకత్వం, ఎడిటింగ్ చేసిన ఈ చిత్రానికి మణిబాబు కరణంతో పాటు దర్శకుడు స్వయంగా స్క్రీన్ ప్లే రాశారు. మణిబాబు కరణం డైలాగ్స్ అందించారు. మాస్ స్టఫ్‌తో లోడ్ చేయబడిన ఈ పాన్ ఇండియా చిత్రం టీజర్ సినిమాపై మరింత హైప్‌ను పెంచింది. 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈగల్ అన్ని దక్షిణ భారత భాషల్లో, హిందీలో విడుదల కానుందని మేకర్స్ మరోసారి స్పష్టం చేశారు.