Advertisementt

300కి ఫారిన్ డాన్సర్స్‌ తో ఎక్స్ ట్రా సాంగ్

Wed 22nd Nov 2023 04:35 PM
extra - ordinary man  300కి ఫారిన్ డాన్సర్స్‌ తో ఎక్స్ ట్రా సాంగ్
Pakka Mass Number shoot happening on Nithiin and Sree Leela 300కి ఫారిన్ డాన్సర్స్‌ తో ఎక్స్ ట్రా సాంగ్
Advertisement
Ads by CJ

టాలెంటెడ్ యాక్ట‌ర్ నితిన్, బ్యూటీ డాల్ శ్రీలీల హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ఎక్స్‌ట్రా - ఆర్డిన‌రీ మ్యాన్.  రైట‌ర్ - డైరెక్ట‌ర్ వ‌క్కంతం వంశీ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ప్రస్తుతం శంషాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో 300కి పైగా ఫారిన్ డాన్సర్స్‌తో జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో పక్కా మాస్ సాంగ్‌ను హీరో నితిన్, శ్రీలీలపై చిత్రీకరిస్తుండటం విశేషం. ఈ పాట చిత్రీకరణతో ఎంటైర్ షూటింగ్ పూర్తవుతుంది. మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు సైతం శరవేగంగా జరుగుతున్నాయి. ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 8న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి డేంజర్ పిల్ల.., బ్రష్ వేస్కో.. సాంగ్స్ విడుదలై ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్‌ను రాబట్టుకున్నాయి. అలాగే రీసెంట్‌గా విడుదలైన టీజర్‌ సైతం అమేజింగ్‌గా ఉందంటూ అప్రిషియేషన్స్ అందుకుంది. మూవీలో యూనిక్‌గా ఉన్న నితిన్ క్యారక్టరైజేషన్, మూవీ కాన్సెప్ట్ అందరినీ ఆకట్టుకోనుంది. నితిన్ ఈ చిత్రంలో జూనియర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్‌లో కనిపించి తనదైన కామెడీ టైమింగ్‌తో ఎంటర్‌టైన్ చేయించనున్నారు. 

Pakka Mass Number shoot happening on Nithiin and Sree Leela:

EXTRA - Ordinary Man: Pakka Mass Number shoot happening on Nithiin and Sree Leela with 300+ dancers under Jani Master Choreography

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ