Advertisementt

సిద్దు జొన్నలగడ్డ తో బొమ్మరిల్లు భాస్కర్ మూవీ

Mon 11th Dec 2023 07:17 PM
siddu jonnalagadda  సిద్దు జొన్నలగడ్డ తో బొమ్మరిల్లు భాస్కర్ మూవీ
Siddhu Jonnalagadda Next Locked సిద్దు జొన్నలగడ్డ తో బొమ్మరిల్లు భాస్కర్ మూవీ
Advertisement
Ads by CJ

స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ మల్టీటాలెంటెడ్ అన్న సంగతి తెలిసిందే. హీరోగా, స్క్రీన్ రైటర్‌గా, కో ఎడిటర్‌గా, క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా పలు విభాగాల్లో తన సత్తాను చాటుకుంటూ ఉన్నారు. డీజే టిల్లు సినిమాతో తిరుగులేని బ్లాక్ బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఎంతో సెలెక్టివ్‌గా సినిమా కథలను ఎంచుకుంటున్నారు. తాజాగా ఈ హీరో బొమ్మరిల్లు భాస్కర్‌తో చేతులు కలిపారు.

ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ మీద నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి వర్కింగ్ టైటిల్‌గా SVCC 37 అని ఫిక్స్ చేశారు. రీసెంట్‌గా ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగిన సంగతి తెలిసిందే.

నేడు ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుందని ఓ స్ట్రైకింగ్ పోస్టర్‌తో అప్డేట్ ఇచ్చారు. ఈ పోస్టర్‌లో బొమ్మరిల్లు భాస్కర్, నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్, హీరో సిద్దు కనిపిస్తున్నారు.

మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ వంటి సూపర్ హిట్‌తో బొమ్మరిల్లు భాస్కర్ మళ్లీ అందరినీ ఆకట్టుకున్నారు. అలాంటి డైరెక్టర్‌తో.. యూత్ సెన్సేషన్ సిద్దు సినిమా చేస్తున్నాడని తెలియడంతోనే అంచనాలు పెరిగాయి. వీరిద్దిరి కాంబోలో రాబోతోన్న ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అంతా భావిస్తున్నారు.

ఈ చిత్రం పూర్తిగా వినోదాత్మకంగా ఉంటుందని మేకర్లు తెలిపారు. క్యాస్ట్ అండ్ క్రూ వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. త్వరలోనే మిగతా వివరాలను ప్రకటించనున్నారు.

Siddhu Jonnalagadda Next Locked:

Siddu to join forces with this director

Tags:   SIDDU JONNALAGADDA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ