Advertisementt

విష్ణు కన్నప్ప హీరోయిన్‌గా ప్రీతి ముకుందన్

Thu 14th Dec 2023 04:49 PM
preity mukhundhan  విష్ణు కన్నప్ప హీరోయిన్‌గా ప్రీతి ముకుందన్
Preity Mukhundhan Makes Grand Entry Kannappa విష్ణు కన్నప్ప హీరోయిన్‌గా ప్రీతి ముకుందన్
Advertisement
Ads by CJ

ప్రస్తుతంభారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం కన్నప్ప. విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ కన్నప్ప మీద దేశ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఆల్రెడీ కన్నప్ప ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు మేకర్స్ మరో ప్రకటన చేశారు. ఈ చిత్రంలో డైనమిక్ స్టార్ విష్ణు మంచు సరసన ప్రీతి ముకుందన్ నటించనున్నారు. ఈ మేరకు టీంలోకి ఆమెను స్వాగతించింది కన్నప్ప చిత్రయూనిట్.

ప్రీతి నటించబోతున్న కీలక పాత్ర కోసం ఆడిషన్స్ నిర్వహించారు. ఎన్నో రకాల ఆడిషన్స్ తరువాత ప్రీతి ఈ పాత్రకు సరిగ్గా సరిపోతుందని చిత్రయూనిట్ భావించింది. విష్ణు మంచు, మోహన్‌లాల్, ప్రభాస్ వంటి వారు నటిస్తున్న ఈ కన్నప్ప మూవీతో ప్రీతి కెరీర్ లో మరో స్థాయికి వెళ్లనున్నారు.

బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ప్రీతి.. తన భరతనాట్య కళతో పాత్రకు ప్రాణం పోయనున్నారు. కన్నప్పలోని యాక్షన్ సీక్వెన్స్‌లతో పాటుగా ఆమె నృత్య నైపుణ్యం ప్రేక్షకులకు విజువల్ ట్రీట్‌గా ఉంటుంది. సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా కన్నప్పను తెరకెక్కిస్తున్నారు.

దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. ప్రీతీకి ఇది తొలి సినిమా మాత్రమే కాదు. కళ, సినిమా రంగాల గురించి మరింత ఎక్కువగా నేర్చుకునే ప్రపంచంలోకి వచ్చింది. ఆమె ఈ పాత్రకు సరిగ్గా సరిపోతుంది. ఆమెతో కలిసి పనిచేయడానికి టీం అంతా ఎదురుచూస్తోంది అని అన్నారు.

Preity Mukhundhan Makes Grand Entry Kannappa :

Preity Mukhundhan Makes Grand Entry Alongside Vishnu Manchu in Epic Actioner Kannappa 

Tags:   PREITY MUKHUNDHAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ