కింగ్ ఖాన్ షారూక్, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరాని కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ మూవీ డంకీ. డిసెంబర్ 21న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై అంచనాలు పీక్స్‌కి చేరుకున్నాయి. ఇప్పటికే డంకీ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, ట్రైలర్‌తో డైరెక్టర్ ప్రేక్షకులకు హృదయాలను హత్తుకునే ఓ కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయబోతున్నారని స్పష్టమైంది. సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా
ప్రస్తుతం డంకీ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. దీంతో సినిమాపై తమకున్న అభిమానాన్ని ప్రేక్షకులు చూపిస్తున్నారు. మనదేశంలోనే కాదు, ఓవర్ సీస్‌లోనూ డంకీ అడ్వాన్స్ బుకింగ్స్‌లో టికెట్స్ చకచకా బుక్ అవుతున్నాయి. ఈ ఏడాది షారూక్ వర్సెస్ షారూక్ అనేలా తన రికార్డులను తనే తిరగ రాసుకుంటున్నారు కింగ్ ఖాన్.
డంకీ చిత్రంలో టాలెంటెడ్ ఆర్టిస్టులు ప్రేక్షకులను మెప్పించటానికి సిద్ధమవుతున్నారు. బోమన్ ఇరాని, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్, అనీల్ గ్రోవర్ సహా బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ ప్రేక్షకుల హృదయాలను దోచుకోనున్నారు.