Advertisementt

అడక్కుండానే అప్ డేట్స్ ఇస్తున్నారు

Mon 05th Feb 2024 07:17 PM
thandel  అడక్కుండానే అప్ డేట్స్ ఇస్తున్నారు
Team Thandel wraps up a schedule in the beautiful scenic village అడక్కుండానే అప్ డేట్స్ ఇస్తున్నారు
Advertisement
Ads by CJ

నాగ చైతన్య, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ చందూ మొండేటి, అల్లు అరవింద్ సమర్పణలో భారీ బడ్జెట్ తో నిర్మాత బన్నీ వాసు నిర్మిస్తున్న తండేల్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించి అప్ డేట్స్ ని అడక్కుండానే మేకర్స్ వదులుతూ అభిమానులని సర్ ప్రైజ్ ఇస్తున్నారు. తాజాగా చిత్ర యూనిట్ కీలక లెంతీ షెడ్యూల్ ని పూర్తి చేసింది. ఈ షెడ్యూల్ లో నాగ చైతన్య, సాయి పల్లవి, ఇతర తారాగణంపై సినిమాలోని చాలా కీలకమైన సన్నివేశాలని చిత్రీకకరీంచారు. ఈ మేరకు వర్కింగ్ స్టిల్స్ ని మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రాన్ని చాలా రియలిస్టిక్ గా తీస్తున్నారు. వర్కింగ్ స్టిల్స్ చూస్తే అది అర్ధమౌతోంది. నాగ చైతన్య, సాయి పల్లవి చాలా సహజ సిద్ధంగా కనిపించారు. ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించడం కోసం సుందరమైన, సహజసిద్ధమైన లోకేషన్స్ లో చిత్రాన్ని షూట్ చేస్తున్నారు మేకర్స్.  

ఇప్పటికే విడుదలైన తండేల్ ప్రమోషనల్ కంటెంట్ సంచలనం సృష్టించింది. ఎసెన్స్ అఫ్ తండేల్ గ్లింప్స్ నేషనల్ వైడ్ గా ట్రెండై సినిమాపై అంచనాలని మ్యాసీవ్ గా పెంచింది. ఈ చిత్రంలో రాజు అనే జాలరి పాత్రలో నాగ చైతన్య నటిస్తుండగా, అతని మనసుని గెలుచుకున్న అమ్మాయిగా సాయి పల్లవి కనిపిస్తోంది. ఇందులో అద్భుతమైన మ్యాజికల్ లవ్ స్టోరీ ఉండబోతుంది. నాగ చైతన్య, సాయి పల్లవి కెమిస్ట్రీ మెస్మరైజింగ్ చేయనుంది. యదార్థ సంఘటనల కథ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. నాగ చైతన్య ఇందులో తన పాత్ర కోసం కంప్లీట్ గా మేక్ఓవర్ అయ్యారు.

Team Thandel wraps up a schedule in the beautiful scenic village :

Thandel movie update 

Tags:   THANDEL
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ