Advertisementt

కిరణ్ అబ్బవరం రహస్య వివాహం !

Mon 11th Mar 2024 03:21 PM
kiran abbavaram  కిరణ్ అబ్బవరం రహస్య వివాహం !
Kiran Abbavaram Rahasyam revealed కిరణ్ అబ్బవరం రహస్య వివాహం !
Advertisement
Ads by CJ

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు. రాజావారు రాణిగారు సినిమాలో హీరోయిన్ గా తనతో కలిసి నటించిన రహస్యను ఆయన పెళ్లి చేసుకోనున్నారు. కిరణ్ అబ్బవరం, రహస్య గత ఐదేళ్లుగా ప్రేమించుకుని, రిలేషన్ షిప్ లో ఉంటున్నారు. ఈ వారమే ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో వీరి ఎంగేజ్ మెంట్ జరగనుంది. తన జీవితాన్ని ఎప్పుడూ ప్రైవేట్ గా ఉంచుకుంటారు కిరణ్ అబ్బవరం. తన వ్యక్తిగత విషయాలు బయటకు ఫోకస్ కానివ్వరు. 

ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యుల సమక్షంలో సింపుల్ గా, ప్రైవేట్ గా ఈ ఎంగేజ్ మెంట్ కార్యక్రమం జరగనుంది. ఈ నిశ్చితార్థం, పెళ్లికి సంబంధించిన తేదీలు, ఇతర వివరాలు త్వరలో కిరణ్ అబ్బవరం టీమ్ వెల్లడించనుంది. కెరీర్ పరంగా చూస్తే కిరణ్ అబ్బవరం ప్రస్తుతం దిల్ రూబా సినిమాతో పాటు 1970వ దశకం నేపథ్యంతో సాగే ఓ పీరియాడిక్ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రాల పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తారు.

Kiran Abbavaram Rahasyam revealed:

Kiran Abbavaram and his girlfriend Rahasya to get eganged

Tags:   KIRAN ABBAVARAM
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ