Advertisementt

చియాన్ విక్ర‌మ్ వీర ధీర శూరన్

Wed 17th Apr 2024 07:42 PM
veera dheera sooran  చియాన్ విక్ర‌మ్ వీర ధీర శూరన్
Chiyaan Vikram 62nd Film: Veera Dheera Sooran చియాన్ విక్ర‌మ్ వీర ధీర శూరన్
Advertisement
Ads by CJ

వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌టమే కాకుండా జాతీయ ఉత్త‌మ న‌టుడిగానూ త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న యాక్ట‌ర్ చియాన్ విక్ర‌మ్‌. బుధ‌వారం ఆయ‌న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మేక‌ర్స్ ఆయ‌న హీరోగా న‌టిస్తోన్న తాజా చిత్రానికి సంబంధించిన టైటిల్ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. చియాన్ 62వ చిత్రానికి వీర ధీర శూరన్ అనే టైటిల్‌ను క‌న్‌ఫ‌ర్మ్ చేశారు. త్వ‌ర‌లోనే తెలుగు టైటిల్‌ను ప్ర‌క‌టించ‌నున్నారు. ఎస్‌.జె.సూర్య‌, దుస‌రా విజ‌య‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. హెచ్‌.ఆర్‌.పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఎస్‌.యు.అరుణ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

వీర ధీర శూరన్ లో ప‌క్కా మాస్ అవ‌తార్‌లో చియాన్ విక్ర‌మ్ అభిమానుల‌ను మెప్పించ‌టం ఖాయంగా క‌నిపిస్తుంది. టీజ‌ర్‌ను గ‌మ‌నిస్తే హీరో పేరు కాళి. త‌న‌కు ఓ కిరాణా షాప్ ఉంటుంది. అందులో త‌ను ప‌ని చేసుకుంటుంటాడు. అత‌నితో అంత‌కు ముందే దెబ్బ‌లు తిన్న విల‌న్స్ జీపులు, వ్యాన్స్ వేసుకుని అక్క‌డికి చేరుకుంటారు. త‌మ‌ను కొట్టింది కిరాణా షాప్‌లో ఉన్న హీరో అని క‌న్‌ఫ‌ర్మ్ అయితే అత‌న్ని చంపేయాల‌నేది వారి ఆలోచ‌న‌.. అయితే విల‌న్స్ జాడ‌ను హీరో ప‌సిగ‌ట్టేస్తాడు. అక్క‌డ ప‌ని చేసుకుంటూనే విల‌న్స్‌ను ఏం చేయాలా అని ఆలోచిస్తుంటాడు. త‌మ‌ను కొట్టింది హీరో అని తెలియ‌గానే విల‌న్స్ క‌త్తులు తీసుకుని దాడి చేయ‌టానికి వస్తుంటారు. అంతే.. మ‌న క‌థానాయ‌కుడు అప్ప‌టి వ‌ర‌కు దాచి పెట్టిన తుపాకీ తీసుకుని ఓ విల‌న్ చెవికి గాయ‌మ‌య్యేట‌ట్లు కాల్చ‌డంలో దుండ‌గులు భ‌యంతో ప‌రుగులు తీస్తారు. షాప్‌లో ఉన్న క‌స్ట‌మ‌ర్ హీరో చేతిలోని గ‌న్ చూసి భ‌య‌ప‌డుతుంది. కానీ హీరో అదేమీ ప‌ట్టించుకోకుండా ఆమె కొన్న స‌రుకుల ఖ‌ర్చు ఎంత‌య్యిందనే విష‌యాన్ని చెప్ప‌టంతో షాపులోని లేడీ క‌స్ట‌మ‌ర్‌, ఓ ప‌క్క భ‌యం, మ‌రో ప‌క్క ఆశ్చ‌ర్యంతో నోరు వెల్ల‌బెట్టేస్తుంది.

225 సెక‌న్ల పాటుండే  వీర ధీర శూరన్ టైటిల్ టీజ‌ర్‌లోనే అంత మాస్ ఎలిమెంట్స్ఉన్న‌ప్పుడు సినిమాలో ఇక ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థం చేసుకోవ‌చ్చు. ఇక చియాన్ విక్ర‌మ్ మాస్ అవ‌తార్ కెవ్వు కేక అనిపించ‌టం ప‌క్కా అని తెలుస్తుంది.

Chiyaan Vikram 62nd Film: Veera Dheera Sooran:

Chiyaan Vikram 62nd Film: Veera Dheera Sooran Unveiled with a Powerful Teaser

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ