Advertisementt

జై హనుమాన్ నుంచి బ్రాండ్ న్యూ పోస్టర్

Tue 23rd Apr 2024 05:50 PM
jai hanuman  జై హనుమాన్ నుంచి బ్రాండ్ న్యూ పోస్టర్
Striking IMAX Poster Of Jai HanuMan జై హనుమాన్ నుంచి బ్రాండ్ న్యూ పోస్టర్
Advertisement
Ads by CJ

పాన్ ఇండియా సంచలనం హను-మాన్ తర్వాత విజనరీ ప్రశాంత్ వర్మ దేశవ్యాప్తంగా సుపరిచితమయ్యారు. క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుండి మరో ఎపిక్ అడ్వెంచర్‌ను మన ముందుకు తీసుకువస్తున్నారు.జై హనుమాన్ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రం హను-మాన్‌కి సీక్వెల్. ఇది ప్రీక్వెల్ ముగింపులో అనౌన్స్ చేశారు. స్క్రిప్ట్ ఇప్పటికే లాక్  చేశారు. సినిమా పెద్ద కాన్వాస్‌పై రూపొందనుంది. ఈ చిత్రంలో ప్రముఖ తారాగణం, సాంకేతిక నిపుణులు భాగం కానున్నారు.

అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం రోజున సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను ప్రారంభించిన దర్శకుడు హనుమాన్ జయంతి సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్‌లో లార్డ్ హనుమాన్ కొండపై చేతిలో గదతో నిలబడి ఉన్నారు. హనుమ ను సమీపించే డ్రాగన్ అగ్నిని పీల్చుకుంటుంది. డ్రాగన్‌లను తొలిసారిగా ఇండియన్ స్క్రీన్‌పైకి తీసుకొస్తున్నారు ప్రశాంత్ వర్మ. టాప్-ఎండ్ VFX , ఇతర సాంకేతికతలతో మనం ఎలాంటి అనుభవాన్ని పొందబోతున్నామో  పోస్టర్ హింట్స్ ఇస్తోంది.

జై హనుమాన్ సినిమా IMAX 3D లో విడుదల కానుంది. ఈ మాగ్నమ్ ఓపస్ ఇతర వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.

ఈరోజు, టీమ్ హను-మాన్100 రోజుల ఈవెంట్‌ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటుంది.

Striking IMAX Poster Of Jai HanuMan:

A Brand New IMAX 3D Poster From Jai Hanuman Unveiled

Tags:   JAI HANUMAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ