Advertisementt

తండేల్ క్లైమాక్స్ పై క్రేజీ న్యూస్

Fri 10th May 2024 06:55 PM
thandel  తండేల్ క్లైమాక్స్ పై క్రేజీ న్యూస్
Thandel to have a dual climax తండేల్ క్లైమాక్స్ పై క్రేజీ న్యూస్
Advertisement
Ads by CJ

కార్తికేయ 2 పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత దర్శకుడు చందు మొండేటి అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ బ్యానర్ లో అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్యతో తండేల్ చిత్రాన్ని సెట్స్ మీదకి తీసుకెళ్లాడు. నాగ చైతన్య సరసన నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఫుల్ స్వింగ్ లో షూటింగ్ జరుపుకుంటున్న తండేల్ మూవీ డిసెంబర్ క్రిష్టమస్ వీక్ లో రిలీజ్ అవ్వబోతుంది.

ఈ చిత్రం సముద్రపు జాలరి పేట నేపథ్యంలో తెరకెక్కుతుంది. సముద్రపు డ్రామా గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగ చైతన్య ఎప్పుడు కనిపించని మాస్ గా కనిపిస్తున్నట్టుగా ఫస్ట్ లుక్ అలాగే షూటింగ్ ఆన్ లొకేషన్ పిక్స్ సూచిస్తున్నాయి. సాయి పల్లవి కూడా మాములు పల్లెటూరి అమ్మాయిలా సింపుల్ గా కనిపించబోతుంది. పడవలు నడుపుతూ చేపలు పట్టే ఒక సామాన్య యువకుడు ప్రాణాలకు తెగించి పాకిస్థాన్ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది. అక్కడికి వెళ్లాక ఎలా జైలు పాలయ్యాడు అనే పాయింట్ మీద చాలా థ్రిల్లింగ్ గా ఈ చిత్రాన్ని చందు మొండేటి తెరకెక్కిస్తున్నాడని తెలుస్తోంది.

తాజాగా తండేల్ క్లైమాక్స్ పై ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తండేల్ కోసం రెండు క్లైమాక్స్ లను చందు పరిశీలిస్తున్నాడట. చైతు - సాయిపల్లవిల మధ్య ప్రేమను ఎలా ముగించాలనే దాని మీద దర్శకుడు చందు వేర్వేరు వెర్షన్లు రాసుకున్నారట. ఆ రెండు క్లైమాక్స్ ల్లో ప్రేక్షకులు దేనిని ఎలా రిసీవ్ చేసుకుంటారనే దానిని బాగా చర్చించి ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ఇక తండేల్ ప్రీ క్లైమాక్స్ నుంచి చైతు - సాయి పల్లవి నటన పీక్స్ లో ఉంటుందట.

Thandel to have a dual climax:

Surprise twists in Thandel Climax

Tags:   THANDEL
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ