Advertisementt

హనుమాన్ నిర్మాత చేతిలో డబుల్ ఇస్మార్ట్

Mon 22nd Jul 2024 06:09 PM
niranjan reddy   హనుమాన్ నిర్మాత చేతిలో డబుల్ ఇస్మార్ట్
Niranjan Reddy Acquire Worldwide Theatrical Rights of Double Ismart హనుమాన్ నిర్మాత చేతిలో డబుల్ ఇస్మార్ట్
Advertisement
Ads by CJ

ఉస్తాద్ రామ్ పోతినేనిన్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డెడ్లీ కాంబినేషన్‌లో మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ డబుల్ ఇస్మార్ట్ చుట్టూ బజ్ చాలా స్ట్రాంగ్ గా వుంది. పోస్టర్‌లు, టీజర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇది మ్యాసీవ్ బ్లాక్‌బస్టర్ ఇస్మార్ట్ శంకర్‌కి సీక్వెల్, ప్రోమోలు ప్రామిస్ చేసినట్లు ఈ మూవీలో మాస్, యాక్షన్, డ్రామా, ఎంటర్ టైన్మెంట్ డబుల్ డోస్ ఉంటుంది.

డబుల్ ఇస్మార్ట్ ఆగష్టు 15న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీ గురువారం (స్వాతంత్ర్య దినోత్సవం), సోమవారం (రక్షా బంధన్) హాలీడేస్ తో 5 రోజుల వీకెండ్ అడ్వాంటేజ్ వుంటుంది. మేకర్స్ ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌తో కొలాబరేట్ అయ్యారు.

డబుల్ ఇస్మార్ట్ తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ ఐదు భాషలు వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ ని ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ నిరంజన్ రెడ్డి & చైతన్య రెడ్డి సొంతం చేసుకున్నారు. పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ హను-మాన్‌ని అందించిన డిస్ట్రిబ్యూషన్ హౌస్ చాలా గ్రాండ్ గా ఐదు భాషల్లో డబుల్ ఇస్మార్ట్ ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది.

పూరి కనెక్ట్స్ బ్యానర్‌లో పూరి జగన్నాధ్, ఛార్మీ కౌర్ నిర్మించిన ఈ సినిమాలో సంజయ్ దత్ పవర్ ఫుల్ పాత్రలో నటించగా, రామ్ సరసన కావ్య థాపర్ హీరోయిన్ గా నటించింది.

Niranjan Reddy Acquire Worldwide Theatrical Rights of Double Ismart:

 Niranjan Reddy Acquire The 5 Languages Worldwide Theatrical Rights of Double Ismart

Tags:   NIRANJAN REDDY
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ