Advertisementt

ఐరా విద్యా పుట్టినరోజు: విష్ణు మంచు విరాళం

Sat 10th Aug 2024 05:15 PM
vishnu manchu  ఐరా విద్యా పుట్టినరోజు: విష్ణు మంచు విరాళం
Vishnu Manchu donates 10 lakhs for underprivileged artists welfare ఐరా విద్యా పుట్టినరోజు: విష్ణు మంచు విరాళం
Advertisement
Ads by CJ

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు విష్ణు మంచు తన కూతురు ఐరా విద్యా మంచు పుట్టిన రోజు సందర్భంగా పది లక్షల విరాళాన్ని ప్రకటించారు. అసోసియేషన్‌లో ఆర్థికంగా వెనుకబడిన కళాకారుల సంక్షేమం కోసం పది లక్షలు విరాళంగా అందించారు. కళాకారులకు సహాయం చేయడం, వారికి అవసరమైన సపోర్ట్, సంరక్షణ అందేలా చేయడం కోసం ఈ మొత్తాన్ని వెచ్చించనున్నారు.

గత మూడు సంవత్సరాలలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ విష్ణు నాయకత్వంలో అద్భుతమైన అభివృద్ధిని సాధించింది. మా భవనంపై విష్ణు మంచు ఫోకస్ పెట్టారు. ఇక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్లు, సినీ ఆర్టిస్టుల మీద సోషల్ మీడియాలో వచ్చే అసత్యపు కథనాలు, ట్రోలింగ్‌ను కట్టడి చేసేందుకు నడుంబిగించారు.

నటులు, వారి కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని కొంతమంది యూట్యూబర్‌లు పోస్ట్ చేసిన అసభ్యకరమైన, అవమానకరమైన కంటెంట్‌ను తీసి వేయించడంలో ప్రముఖ పాత్ర పోషించారు. విష్ణు చేపట్టిన ఈ చర్యలను ఇతర ఇండస్ట్రీలకు చెందిన ఆర్టిస్టులు కూడా ప్రశంసించారు. విష్ణు తీసుకున్న ఈ నిర్ణయాత్మక చర్య అతని నాయకత్వానికి ప్రతీకగా నిలిచింది.  

విష్ణు మంచు ప్రస్తుతం కన్నప్ప చిత్రం ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ మూవీ డిసెంబర్ 2024లో విడుదల కానుంది. భారీ తారాగణంతో రాబోతోన్న కన్నప్పపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే.

Vishnu Manchu donates 10 lakhs for underprivileged artists welfare:

Vishnu Manchu donates 10 lakhs for underprivileged artists welfare on daughter Ayra Vidya Manchu birthday

Tags:   VISHNU MANCHU
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ