Advertisementt

రేవు నుంచి ఓలె ఓలె సాంగ్ రిలీజ్

Sat 10th Aug 2024 05:58 PM
revu  రేవు నుంచి ఓలె ఓలె సాంగ్ రిలీజ్
Ole Ole song from Revu Movie రేవు నుంచి ఓలె ఓలె సాంగ్ రిలీజ్
Advertisement
Ads by CJ

వంశీ రామ్ పెండ్యాల, అజయ్, స్వాతి భీమిరెడ్డి, ఏపూరి హరి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా రేవు. ఈ చిత్రాన్ని సంహిత్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్, పారుపల్లి ప్రొడక్షన్ పై నిర్మాత డా. మురళీ గింజుపల్లి, నవీన్ పారుపల్లి సంయుక్తంగా నిర్మించారు.  నిర్మాణ సూపర్ విజన్‌గా జర్నలిస్ట్ ప్రభు, ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ పర్వతనేని రాంబాబు వ్యవహరిస్తున్నారు.. హరినాథ్ పులి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న రేవు సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. 

ఇప్పటికే రిలీజ్ చేసిన కంటెంట్, పోస్టర్లు, టీజర్, పాటలు ఇలా అన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. తాజాగా ఓ ఎమోషనల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఓలె ఓలె అంటూ సాగే ఈ పాటను ఇమ్రాన్ శాస్త్రి రచించారు. జాన్ కే జోసెఫ్ పాడిన తీరు ఎంతో ఎమోషనల్‌గా ఉంది. జాన్ కే జోసెఫ్ అందించిన బాణీ గుండెల్ని హత్తుకునేలా ఉంది.

ఈ సినిమాకు రేవంత్ సాగర్ కెమెరామెన్‌గా, శివ శర్వానీ ఎడిటర్‌గా పని చేశారు. ఈ మూవీ రిలీజ్ డేట్‌ను త్వరలోనే ప్రకటించనున్నారు.

ఆర్టిస్టులు: వంశీ రామ్ పెండ్యాల, అజయ్, స్వాతి భీమిరెడ్డి, ఏపూరి హరి, గురు తేజ్, సుమేష్ మాధవన్, హేమంత్ ఉద్భవ్, లీలా వెంకటేష్ కొమ్మూరి, తదితరులు.

సాంకేతిక నిపుణులు: డి ఓ పి - రేవంత్ సాగర్ నేపథ్య సంగీతం- వైశాఖ్ మురళీధరన్ పాట- జాన్ కె జోసెఫ్ ఎడిటర్ - శివ శర్వాని కళ- బాషా సాహిత్యం - ఇమ్రాన్ శాస్త్రి, నిర్మాణ పర్యవేక్షణ జర్నలిస్ట్ ప్రభు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత పర్వతనేని రాంబాబు, నిర్మాతలు డా॥ మురళీ గింజుపల్లి, నవీన్ పారుపల్లి రచయిత దర్శకుడు - హరినాథ్ పులి.

Ole Ole song from Revu Movie:

Ole Ole song release from Revu Movie

Tags:   REVU
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ