మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్- బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కలయికలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో నటిస్తున్న దేవర మూవీ ఈ నెల 27 న విడుదలకు సిద్దమవుతుంది. దేవర ప్రమోషనల్ కంటెంట్ లో భాగంగా దేవర సాంగ్స్ ఒక్కొక్కటి వదులుతూ హైప్ పెంచే ఏర్పాట్లలో ఉన్నారు మేకర్స్.
దేవర సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫియర్ సాంగ్.., చుట్టమల్లె.. సాంగ్స్ ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్‌ను రాబట్టుకోవటమే కాకుండా సినిమాపై ఉన్న అంచనాలను నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్లాయి. సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ సైతం ట్వీట్స్‌తో అంచనాలను పెంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ చిత్రం నుంచి దావుడి.. అనే వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. ఎన్టీఆర్ డాన్స్ గురించి ఆడియెన్స్‌కు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరోసారి ఈ పాటలో తారక్ డాన్స్ ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్‌తో అదరగొట్టేశారు. దీంతో ఈ పాట సినిమాపై అంచనాలను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లింది. అనిరుద్ కంపోజ్ చేసిన ట్యూన్ ప్రతీ ఒక్కరినీ డాన్స్ చేసేలా చేస్తోది. ఇన్‌స్టెంట్ చార్ట్ బస్టర్‌గా నిలిచిన ఈ పాట మిగిలిన పాటలపై ఎక్స్‌పెక్టేషన్స్‌ను పెంచేసింది.
అనిరుద్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. పెప్పీ బీట్స్‌కు ఆయనెలాంటి సంగీతాన్ని అందిస్తారో అందరికీ తెలిసిందే. దేవరలో దావుడి సాంగ్‌ను వావ్ అనిపించేలా కంపోజ్ చేశారు. రామజోగయ్య శాస్త్రి తెలుగులో రాసిన ఈ పాటను తమిళంలో విఘ్నేష్ శివన్, హిందీలో కౌసర్ మునీర్, కన్నడలో వరదరాజ్ చిక్‌బల్లాపుర, మలయాళంలో మాన్‌కొంబు గోపాలకృష్ణ రాశారు. ఈ పాటలో జాన్వీ లుక్ చాలా బావుంది. తారక్, జాన్వీ మధ్య కెమిస్ట్రీ చూడచక్కగా అనిపిస్తుంది.