Advertisementt

గేమ్ ఛేంజ‌ర్‌ నుంచి సెకండ్ సింగిల్‌ అప్డేట్

Sat 07th Sep 2024 07:00 PM
game changer  గేమ్ ఛేంజ‌ర్‌ నుంచి సెకండ్ సింగిల్‌ అప్డేట్
Game Changer Second Single update గేమ్ ఛేంజ‌ర్‌ నుంచి సెకండ్ సింగిల్‌ అప్డేట్
Advertisement
Ads by CJ

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’ మీదున్న అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్  నిర్మిస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. 2024 క్రిస్మస్ సందర్భంగా సినిమాను తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. 

మూవీ నుంచి ఇప్పటికే వదిలిన పోస్టర్స్, జరగండి జరగండి.. సాంగ్‌, వస్తోన్న అప్డేట్లతో  గేమ్ ఛేంజ‌ర్‌పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ క్ర‌మంలో వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా ఈ మూవీ నుంచి మ‌రో క్రేజీ అప్‌డేట్ వ‌చ్చేసింది. ఈ సెప్టెంబ‌ర్ నెల‌లో సినిమా నుంచి మ‌రో సాంగ్‌కి సంబంధించిన అప్డేట్ ఇవ్వబోతున్నట్లు మేక‌ర్స్ తెలియ‌జేశారు. 

ఇప్ప‌టికే ‘గేమ్ చేంజర్’ నుంచి తమన్ సంగీత సారథ్యంలో వచ్చిన జరగండి జరగండి.. పాట ఎంత సెన్సేష‌న్ అయ్యిందో అంద‌రికీ తెలిసిందే. తాజాగా వినాయ‌క చ‌వితికి ఇచ్చిన అప్‌డేట్ పోస్ట‌ర్, అందులోని న్యూస్ అభిమానులు స‌హా అంద‌రిలోనూ మ‌రింత ఉత్సాహాన్ని నింపేలా ఉంది. పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే.. త‌ల‌కు ఎర్ర‌టి ట‌వ‌ల్ చుట్టుకుని స్టైలిష్ అవ‌తార్‌లో క‌నిపిస్తున్నారు రామ్ చ‌ర‌ణ్‌. ఆయ‌న బ్యాగ్రౌండ్‌ను గ‌మ‌నిస్తే.. ఉత్స‌వంలో వేషధార‌ణ చేసుకున్న‌ట్లు ఉండేలా కొంద‌రు ఉన్నారు. అంద‌రూ సంతోషంగా డాన్స్ చేస్తూ క‌నిపిస్తున్నారు. 

డైరెక్ట‌ర్ శంక‌ర్ లార్జర్ దేన్ లైఫ్ సినిమాల‌ను తెర‌కెక్కించ‌ట‌మే కాకుండా, అభిమానుల‌కు, ప్రేక్ష‌కుల‌కు సినిమా డిఫ‌రెంట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందిస్తుంటారు. రామ్ చ‌ర‌ణ్‌లాంటి మాస్ హీరో ఉన్న‌ప్పుడు ఆ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఎలా ఉంటుందో చూడాల‌ని మెగాభిమానులు, మూవీ ల‌వర్స్ ‘గేమ్ ఛేంజ‌ర్‌’ కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న తెర‌కెక్కించిన సినిమాల‌ను మించేలా గేమ్ ఛేంజ‌ర్‌ ను ఆయ‌న రూపొందిస్తున్నారు. పవరఫుల్  రోల్ లో చ‌ర‌ణ్‌ను ప్రెజెంట్ చేస్తున్నారు శంక‌ర్‌.

Game Changer Second Single update :

Game Changer Second Single sensation this September

Tags:   GAME CHANGER
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ