Advertisementt

కంగువ రిలీజ్ డేట్

Thu 19th Sep 2024 06:04 PM
suriya  కంగువ రిలీజ్ డేట్
Kanguva Grand release in theatres on November కంగువ రిలీజ్ డేట్
Advertisement
Ads by CJ

స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ కంగువ నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. అక్టోబర్ 10వ తేదీన రావాల్సిన కంగువ మరిన్ని హంగులతో ముస్తాభై నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకురాబోతోంది. ఈ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ సందర్భంగా విడుదల చేసిన వీడియో ఆకట్టుకుంటోంది. కంగువ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. 

దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కంగువ సినిమాను హ్యూజ్ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను నైజాం ఏరియాలో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేయబోతున్నారు. 

కంగువ నుంచి ఇప్పటిదాకా రిలీజ్ చేసిన సిజిల్ టీజర్, పోస్టర్స్, ఫైర్ సాంగ్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ భారీ చిత్రాన్ని బిగ్ స్క్రీన్ మీద చూడాలనే ఆసక్తితో ప్రేక్షకులంతా వెయిట్ చేస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ జానర్ లో ఇప్పటిదాకా తెరపైకి రాని ఒక కొత్త కాన్సెప్ట్ తో కంగువ ప్రేక్షకుల్ని ఆకట్టుకోబోతోంది. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి వస్తున్న మరో బిగ్గెస్ట్ మూవీగా కంగువ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి.

Kanguva Grand release in theatres on November:

Suriya prestigious project Kanguva Grand release in theatres on November 14th

Tags:   SURIYA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ