Advertisementt

HHVM: డిప్యూటీ సీఎం దిగాడు బరిలోకి !

Fri 20th Sep 2024 01:18 PM
hari hara veera mallu  HHVM: డిప్యూటీ సీఎం దిగాడు బరిలోకి !
Hari Hara Veera Mallu to kickstart the shoot on a massive scale on 23rd September HHVM: డిప్యూటీ సీఎం దిగాడు బరిలోకి !
Advertisement
Ads by CJ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రజా సేవే లక్ష్యంగా రాజకీయ రంగ ప్రవేశం చేసి, అక్కడా గొప్ప నాయకుడిగా పేరు పొందారు. ప్రజాసేవకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న పవన్ కళ్యాణ్, హరి హర వీర మల్లు చిత్రం యొక్క మిగిలిన షూటింగ్ ను పూర్తి చేయడానికి తగిన సమయం కేటాయించలేకపోయారు. సమాజ సేవ పట్ల పవన్ కళ్యాణ్ నిబద్ధతను అర్థం చేసుకున్న చిత్ర నిర్మాతలు, ఆయన భాగంకాని ఇతర సన్నివేశాల చిత్రీకరణ మరియు చిత్రానికి సంబంధించిన ఇతర కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్, గతంలో తాను అంగీకరించిన చిత్రాలను పూర్తి చేయాల్సిన బాధ్యతపై కూడా తనపై ఉందని, వీలు చూసుకొని షూటింగ్ కోసం తగు సమయం కేటాయిస్తానని మాట ఇచ్చారు. తన మాటకు కట్టుబడి ఉన్న పవన్ కళ్యాణ్, హరి హర వీర మల్లు మొదటి భాగం యొక్క మిగిలిన షూటింగ్ ను పూర్తి చేయడానికి సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత ఆయనతో కలిసి చేయడానికి నటీనటులు, సాంకేతిక సిబ్బంది ఎంతో  ఉత్సాహంగా ఉన్నారు. వెండితెరపై ప్రేక్షకులకు మరపురాని అనుభూతిని అందించాలనే ఉద్దేశంతో, నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా భారీస్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

సెప్టెంబర్ 23వ తేదీ నుంచి విజయవాడలో హరి హర వీర మల్లు కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. హాలీవుడ్ దిగ్గజ యాక్షన్ దర్శకుడు నిక్ పావెల్ ఆధ్వర్యంలో భారీ యుద్ధ సన్నివేశం చిత్రీకరించబోతున్నామని నిర్మాతలు తెలిపారు.

బ్రేవ్‌హార్ట్, గ్లాడియేటర్, బోర్న్ ఐడెంటిటీ, ది లాస్ట్ సమురాయ్, రెసిడెంట్ ఈవిల్: రిట్రిబ్యూషన్ వంటి పలు క్లాసిక్ చిత్రాలకు నిక్ పావెల్ పనిచేశారు. 1986లో సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆయన, సెకండ్ యూనిట్ డైరెక్టర్‌గా, స్టంట్ కో-ఆర్డినేటర్‌గా, ఫైట్ కొరియోగ్రాఫర్‌గా పని చేస్తూ తనదైన ముద్ర వేశారు. ప్రతిష్టాత్మక టారస్ వరల్డ్ స్టంట్ అవార్డులకు ఏకంగా 12 సార్లు నామినేట్ అయిన నిక్ పావెల్, ఐదు అవార్డులను గెలుచుకున్నారు.

నిక్ పావెల్ తన అసాధారణ నైపుణ్యంతో హరి హర వీర మల్లు యుద్ధ సన్నివేశాలను అద్భుతంగా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ భారీ యుద్ధ సన్నివేశాలను 400 మంది సిబ్బందితో పాటు భారీ సంఖ్యలో జూనియర్ ఆర్టిస్టులు, ఫైటర్లతో చిత్రీకరించనున్నారు.

Hari Hara Veera Mallu to kickstart the shoot on a massive scale on 23rd September:

Pawan Kalyan  Hari Hara Veera Mallu to kickstart the shoot on a massive scale on 23rd September

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ