కిరణ్ రావు లాపతా లేడీస్ ఏకగ్రీవంగా ఎంపికైంది -ఉమామహేశ్వర రావు
2025 లో జరిగే ఆస్కార్ అవార్డులకు భారత దేశం తరుపున అమీర్ ఖాన్ కిరణ్ రావు దర్శకత్వంలో బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ నిర్మించిన లాపతా లేడీస్ సినిమా ఎంపికైనట్టు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సోమవారం రోజు చెన్నై ప్రకటించింది.
ఈ కమిటీకి జాను బారువా చైర్మన్ గా, రితుపర్ణ సేన్ గుప్త, మంజునాథ, సంతోష్, అవికా ముఖోపాధ్యాయ, సుబ్బియ నల్లముత్తు, రవి జాదవ్, జి.పి. విజయ కుమార్, అవినాష్ శెట్టి, బాబీ బేడీ, కె. ఉమా మహేశ్వర రావు, భార్గవ్ పురోహిత్, ప్రవీణ్, లొంగిన్స్ ఫెర్నాండెస్, యువరాజ్ సభ్యులుగా వున్నారు.
ఆస్కార్ అవార్డు కోసం భారత దేశం నుంచి 29 సినిమాలు వచ్చాయి. అందులో హనుమాన్, లాపతా లేడీస్, చోటా భీం, కల్కి 2898, గుడ్ లక్, ఘరత్ గణపతి, కిల్, ఎనిమల్, శ్రీకాంత్, అట్టం, చందు ఛాంపియన్, కోట్టుక్కాలి, మహారాజ, జోరం, మైదాన్, సాంబహదూర్, ఉల్లోజహుక్కో, మంగళవారం, ఆడుజీవితం, జిగర్తాండ డబల్, స్వాతంత్య్ర వీర సర్కార్, తంగలాన్, జామ, వాజయ్, స్వరగాంధర్వ సుధీర్ ఫడ్కే, ఆర్టికల్ 370, ఘాత్, అబ్బా, అల్ ఉయ్ ఇమాజిన్ యాజ్ లైట్ చిత్రాలు వచ్చాయి.
తెలుగు సినిమా రంగం నుంచి ఆస్కార్ కమిటీకి ఎంపికైన కొండపనేని ఉమామహేశ్వర రావు మాట్లాడుతూ.. 29 సినిమాల్లో కిరణ్ రావు దర్శకత్వం వహించిన లాపతా లేడీస్ సినిమా కథ, కధనం బాగున్నాయని, ఆ సినిమాలో ఎంతో సందేశం ఉందని, ఇది భారత దేశం నుంచి ఆస్కార్ కు వెళ్ళడానికి అన్ని అర్హతలు ఉన్నాయని తమ కమిటీ భావించిందని చెప్పారు.