శ్రీదేవి కుమార్తె గా హిందీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ కు బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకులు తగల్లేదు. అక్కడ జాన్వీ కపూర్ వరుస సినిమాలు చేసినా అన్ని సో సో గానే మిగిలిపోయాయి. ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి జోడిగా దేవర చిత్రంతో సౌత్ కి ఎంట్రీ ఇవ్వబోతుంది. మరికొన్ని గంటల్లో దేవర విడుదల కాబోతుంది.
ఎన్టీఆర్ ఫ్యాన్స్ దేవర చిత్రం కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో అంతకు మించి జాన్వీ కపూర్ తన అదృష్టం సౌత్ లో ఎలా ఉండబోతుందో అనే ఉత్కంఠతో కనిపిస్తుంది. దేవర లాంటి పాన్ ఇండియా మూవీతో సౌత్ లో లాంచ్ అవుతున్న జాన్వీ కపూర్ అదృష్టం పై సర్వత్రా చర్చ జరుగుతుంది.
తంగం పాత్రలో సింపుల్ గా కనిపిస్తున్న జాన్వీ కపూర్ దేవర సాంగ్స్ లో మాత్రం ఫుల్ గా అందాలు ఆరబోసింది. బాలీవుడ్ లో నిరూపించుకున్నాకే జాన్వీ కపూర్ సౌత్ లోకి ఎంట్రీ ఇద్దామని, ఆమెకి సౌత్ అవకాశాలొచ్చినా రిజక్ట్ చేసింది. కానీ హిందీలో జాన్వీ కపూర్ కి ఆశించిన రిజల్ట్ రాలేదు. అందుకే దేవర తో జాన్వీ గ్రాండ్ గా సౌత్ ఎంట్రీ ఇవ్వబోతుంది.
దేవర సక్సెస్ ఎవరికి ఎంతగా అవసరమో తెలియదు కానీ.. జాన్వీ కపూర్ మాత్రం మొదటి సినిమానే హిట్ కొట్టి సక్సెస్ తో సౌత్ కి పరిచయమవ్వాలనే ఆశతో కనబడుతుంది.