Advertisementt

రా మ‌చ్చా అంటూ రామ్ చరణ్ ఇరగ్గొట్టేసాడు

Mon 30th Sep 2024 06:49 PM
ram charan  రా మ‌చ్చా అంటూ రామ్ చరణ్ ఇరగ్గొట్టేసాడు
Game Changer Ra Macha Macha galvanises రా మ‌చ్చా అంటూ రామ్ చరణ్ ఇరగ్గొట్టేసాడు
Advertisement
Ads by CJ

ఎట్ట‌కేల‌కు అభిమానుల నిరీక్ష‌ణకు బ్రేక్ ప‌డింది. మెగా ఫ్యాన్స్‌తో పాటు, సినీ ల‌వ‌ర్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం గేమ్ చేంజర్ నుంచి సెకండ్ సాంగ్ రా మ‌చ్చా మ‌చ్చా.. సాంగ్ రిలీజైంది.రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం గేమ్ చేంజర్. ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్‌.  2024 క్రిస్మస్ సందర్భంగా సినిమాను తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. 

కాగా.. సోమ‌వారం ఈ మూవీ నుంచి రా మచ్చా మచ్చా.. అనే లిరిక‌ల్ సాంగ్ రిలీజ్ చేశారు మేక‌ర్స్‌. తెలుగు, తమిళంలో రా మచ్చా మచ్చా.. అంటూ సాగే ఈ పాట హిందీలో ధమ్ తు  దికాజా.. అంటూ అలరిస్తోంది. 

రామ్ చ‌ర‌ణ్ ఇంట్ర‌డ‌క్ష‌న్ సాంగ్‌గా తెర‌కెక్కిన ఈ పాటను శంక‌ర్ త‌న‌దైన మార్క్ చూపిస్తూ గ్రాండియ‌ర్‌గా తెర‌కెక్కించారు. రామ్ చ‌ర‌ణ్‌  ఎన‌ర్జిటిక్‌, స్టైలిష్ లుక్‌లో అల‌రించారు. ఇక గ్రేస్‌తో ఆయ‌న వేసిన హుక్ స్టెప్ ఎక్స్‌ట్రార్డిన‌రీగా ఉంది. ఈ పాట‌లో  ఏకంగా 1000కి పైగా జాన‌ప‌ద క‌ళాకారులు ఈ పాట‌లో గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి డాన్స్ చేయటం విశేషం. అది కూడా భిన్న‌త్వానికి ఏక‌త్వమైన మ‌న దేశంలోని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఒరిస్సా, క‌ర్ణాట‌క‌, వెస్ట్ బెంగాల్‌, జార్ఖండ్  రాష్ట్రాల‌కు చెందిన జాన‌ప‌ద క‌ళాకారులు.. ఇందులో భాగ‌మ‌వ‌టం విశేషం.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సంస్కృతుల‌ను బేస్ చేసుకుని పాట‌ను శంక‌ర్ వినూత్నంగా తెర‌కెక్కించారు. ఏపీలో గుసాడి, కొమ్ము కోయ‌, త‌ప్పెట గుళ్లు వంటి జాన‌ప‌ద నృత్యాల‌తో పాటు వెస్ట్ బెంగాల్‌కు చెందిన చౌ, ఒరిస్సాకు చెందిను గుమ్రా, రాన‌ప్ప‌, పైకా, దురువ వంటి వాటితో పాటు క‌ర్ణాట‌కు చెందిన హ‌లారి. ఒక్క‌లిగ‌, గొర‌వ‌ర‌, కుణిత వంటి నృత్య రీతుల‌ను కూడా భాగం చేశారు శంక‌ర్‌. గ‌ణేష్ ఆచార్య మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీలో మ్యూజిక్ సెన్సేష‌న్ త‌మ‌న్ సంగీత సారథ్యంలో పాట రూపుదిద్దుకుంది.  తెలుగు, తమిళం, హిందీలో న‌కాష్ అజీజ్ పాడిన ఈ పాటను తెలుగులో అనంత్ శ్రీరామ్ రాయగా, తమిళంలో వివేక్, హిందీలో కుమార్ రాశారు.  

రామ్ చ‌ర‌ణ్‌, కియారా అద్వానీ.. గేమ్ ఛేంజ‌ర్‌లో అల‌రించ‌టానికి రెడీ అయ్యారు. ఈ క్యూట్ పెయిర్ సంద‌డిని సిల్వ‌ర్ స్క్రీన్‌పై చూడాల‌నే ఉత్సాహం అంద‌రిలోనూ క‌నిపిస్తోంది. ఇయ‌ర్ ఎండింగ్‌లో క్రిస్మ‌స్ సెల‌బ్రేష‌న్స్ టు న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్  గేమ్ ఛేంజ‌ర్ రెడీ అంటోంది.

Game Changer Ra Macha Macha galvanises:

Ram Charan, Star Director Shankar Game Changer Ra Macha Macha galvanises

Tags:   RAM CHARAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ