Advertisementt

FNCC కు ఆద్యుడు ఎన్.టి.ఆర్ -కె ఎస్.రామారావు

Wed 02nd Oct 2024 05:13 PM
n.t.r. centenary committee  FNCC కు ఆద్యుడు ఎన్.టి.ఆర్ -కె ఎస్.రామారావు
Film Nagar Cultural Center was pioneered by N. T. R -K.S. Rama Rao FNCC కు ఆద్యుడు ఎన్.టి.ఆర్ -కె ఎస్.రామారావు
Advertisement
Ads by CJ
>FNCC అధ్యక్షులు కె. ఎస్. రామారావు కు ఎన్. టి. ఆర్. శత జయంతి కమిటీ సత్కరించింది.

ఫిలిమ్ నగర్ కల్చరల్ సెంటర్ ఇవ్వాళ దేశంలోనే ఇంత ప్రతిష్టాత్మకంగా ఉన్నదంటే అందుకు ఆద్యులు నందమూరి తారక రామారావు గారేనని అధ్యక్షులు కె. ఎస్. రామారావు తెలిపారు. 2024 - 25 సంవత్సరాలకు ఎఫ్. ఎన్. సి. సి అధ్యక్షులుగా ఎన్నికైన కె. ఎస్. రామారావు ను ఎన్. టి. ఆర్. శత జయంతి కమిటీ సత్కరించింది.

ఈ సందర్భంగా కె. ఎస్. రామారావు మాట్లాడుతూ.. 1995లో ఎన్. టి. రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డి. వి. ఎస్. రాజు గారి ద్వారా మద్రాస్ లో స్థిరపడిన మా అందరినీ ఆహ్వానించారు. మద్రాసు నుంచి మా అందరినీ హైదరాబాద్ కు తరలి రమ్మన్నారు. అప్పుడు ఫిలిమ్ నగర్ లో మా అందరికీ ఓకే సమావేశమందిరం కావాలని అడిగాము, వారు వెంటనే ఫిలిమ్ నగర్ లో స్థలం చూసుకోమ్మన్నారు. మేము ఇప్పుడున్న కొండను ఎంపిక చేసుకొని చెప్పాము, వారు వెంటనే అధికారులను పిలిపించి ఫైల్ సిద్ధం చెయ్యమన్నారు. అయితే ఆ తరువాత జరిగిన రాజకీయ పరిణామాలతో చంద్ర బాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. రామారావు గారు స్థలం ఇస్తామని చెప్పిన సంగతి బాబు గారితో చెప్పగానే మరో మాట లేకుండా ఈ స్తలాన్ని కల్చరల్ సెంటర్ కు కేటాయించారు. చంద్ర బాబు గారే శంకుస్థాపన చేసి ప్రారంభించారని కె. ఎస్. రామారావు తెలిపారు.

ఎన్. టి. ఆర్.సెంటినరీ కమిటీ చైర్మన్ టి. డి. జనార్దన్ మాట్లాడుతూ.. తెలుగు సినిమా రంగంలో కె. ఎస్. రామారావు గారంటే ఒక బ్రాండ్, ఆయన హయాంలో ఫిలిమ్ నగర్ కల్చరల్ సెంటర్ బహుముఖాలుగా అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నా అన్నారు.

ఎన్. టి. రామారావు గారు హీరోగా నటించిన విచిత్ర కుటుంబం సినిమా ద్వారా 1969లో అసిస్టెంట్ దర్శకుడుగా కె. ఎస్. రామారావు సినిమా రంగంలోకి ప్రవేశించారని భగీరథ తెలిపారు.

ఈ సమావేశంలో ఎన్. టి. ఆర్. కమిటీ సభ్యులు, రవి శంకర్, మధుసూదన రాజు, రాంబాబు పర్వతనేని, శ్రీపతి సతీష్ పాల్గొన్నారు.

Film Nagar Cultural Center was pioneered by N. T. R -K.S. Rama Rao:

FNCC President K.S. Rama Rao to N.T.R. Honored by the Centenary Committee

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ