Advertisementt

అమరన్ టీంకి సూపర్ స్టార్ ప్రశంశలు

Sat 02nd Nov 2024 04:54 PM
rajinikanth  అమరన్ టీంకి సూపర్ స్టార్ ప్రశంశలు
Super star praises for the Amaran team అమరన్ టీంకి సూపర్ స్టార్ ప్రశంశలు
Advertisement
Ads by CJ

శివకార్తికేయన్, సాయి పల్లవి నేషన్ ప్రైడ్ బ్లాక్ బస్టర్ అమరన్. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఉలగనాయగన్ కమల్ హాసన్, R. మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి నిర్మించారు.

నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి, సిస్టర్ నిఖిత రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగులో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ ద్వారా గ్రాండ్ గా విడుదల చేశారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి ఘన విజయాన్ని సాధించి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ అమరన్ చిత్రం పై ప్రశంసల జల్లు కురిపించారు.

ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించిన రజనీకాంత్‌.. సినిమాని నిర్మించిన తన మిత్రుడు కమల్‌హాసన్‌కు ఫోన్‌ చేసి అభినందించారు. అద్భుతమైన చిత్రాన్ని నిర్మించారని మెచ్చుకున్నారు. అలాగే, హీరో శివకార్తికేయన్, దర్శకుడు రాజ్‌కుమార్ , నిర్మాత ఆర్. మహేంద్రన్, సినిమాటోగ్రాఫర్ సాయి లని ప్రత్యేకంగా కలిశారు. సినిమా కథ, కథనం, యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ అద్భుతంగా వున్నాయని టీమ్‌ అందరినీ ప్రశంసించారు. అమరన్ యునానిమస్ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది.

Super star praises for the Amaran team:

Rajinikanth congratulates team Amaran

Tags:   RAJINIKANTH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ