Advertisementt

అఫీషియల్: NBK109 టైటిల్ టీజర్ డేట్ ఫిక్స్

Tue 12th Nov 2024 06:13 PM
nbk 109  అఫీషియల్: NBK109 టైటిల్ టీజర్ డేట్ ఫిక్స్
NBK 109 Title Glimpse Date Fix అఫీషియల్: NBK109 టైటిల్ టీజర్ డేట్ ఫిక్స్
Advertisement
Ads by CJ

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, తన 109వ చిత్రం NBK109 కోసం బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లితో చేతులు కలిపారు. నందమూరి అభిమానులతో పాటు, తెలుగు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదుచూస్తున్న ఈ చిత్ర టైటిల్‌ టీజర్ కి ముహూర్తం ఖరారైంది.

NBK109 పోస్టర్లు, రెండు భారీ యాక్షన్ గ్లింప్స్ లు అందరినీ కట్టిపడేశాయి. ముఖ్యంగా బాలకృష్ణను మునుపెన్నడూ చూడని కొత్త అవతారంలో దర్శకుడు బాబీ చూపిస్తున్న తీరుకి అందరూ ఫిదా అయ్యారు. టైటిల్ తో పాటు, ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకోవాలని అభిమానులు, సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ కార్తీక పూర్ణిమకి వారి నిరీక్షణకు తెరపడనుంది. తాజాగా టైటిల్‌ టీజర్ విడుదల తేదీని నిర్మాతలు ప్రకటించారు.

కార్తీక పూర్ణిమ శుభ సందర్భంగా, నవంబర్ 15న NBK109 టైటిల్ టీజర్‌ను విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. విభిన్న దుస్తులు ధరించి, ప్రత్యేకంగా రూపొందించిన ఆయుధాలను చేతబట్టిన బాలకృష్ణ లుక్ ఎంతో శక్తివంతంగా ఉంది. నెత్తురంటిన గొడ్డలిని పట్టుకొని, పొడవాటి జుట్టు, గుబురు గడ్డంతో బాలకృష్ణ నిల్చొని ఉన్న రూపం మరో స్థాయిలో ఉంది. ఈ ఒక్క పోస్టర్ సినిమాపై అంచనాలను ఎన్నో రెట్లు పెంచేలా ఉంది.

NBK 109 Title Glimpse Date Fix:

NBK 109 Title Glimpse on 15th November

Tags:   NBK 109
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ