Advertisementt

మారియో క్లెయిర్‌ సెలూన్‌ ఓపెనింగ్ లో బిగ్‌ బాస్‌ సెలబ్రిటీలు

Thu 21st Nov 2024 03:14 PM
marie claire salon  మారియో క్లెయిర్‌ సెలూన్‌ ఓపెనింగ్ లో బిగ్‌ బాస్‌ సెలబ్రిటీలు
Bigg Boss Celebrities at Marie Claire Salon Opening మారియో క్లెయిర్‌ సెలూన్‌ ఓపెనింగ్ లో బిగ్‌ బాస్‌ సెలబ్రిటీలు
Advertisement
Ads by CJ

మారియో క్లెయిర్‌ సెలూన్‌ ఓపెనింగ్ లో బిగ్‌ బాస్‌ సెలబ్రిటీలు

నార్సింగిలో  ప్రారంభోత్సవంలో బిగ్‌ బాస్‌ సెలబ్రిటీలు సమీర్, అశ్విని, సౌమ్య జాను, బేబక్క సందడి...

ప్రఖ్యాత మెన్, ఉమెన్‌ పారిస్‌ బ్రాండ్‌ సెలూన్‌ మారియో క్లెయిర్‌  నార్సింగిలో ప్రారంభమైంది. ఈ సెలూన్‌ ప్రారంభోత్సవంలో పలువురు బిగ్‌బాస్‌ సెలబ్రిటీలు అశ్విని, సౌమ్య జాను, బేబక్క  (సింగర్‌ మధు) అతిథులుగా పాల్గొని సందడి చేశారు. వారంతా మాట్లాడుతూ– స్వర్ణ మా అందరితో పాటు నటిగా అనేక టీవి సీరియల్స్‌లో రాణిస్తూనే బిజినెస్‌ ఉమెన్‌గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేము స్వర్ణ పెట్టిన ఈ అత్యాధునిక సెలూన్‌లో రకారకాల సర్వీసులు ఆల్రెడీ తీసుకున్నాం. సర్వీసెస్‌ అన్నీ కూడా ఎంతో బావున్నాయి అన్నారు.  ఆధునిక ఫ్యాషన్, అందానికి ఫ్రెంచ్‌ స్టైల్‌ను మోడల్‌ గా చెబుతుంటారు. 

అలాంటి ఫ్రెంచ్‌ బ్యూటీని నగరవాసులు కూడా మారియో క్లెయిర్‌ ద్వారా పొందవచ్చని నిర్వాహకురాలు స్వర్ణ తెలిపారు. నార్సింగి మారియో క్లెయిర్‌ సెలూన్‌ లో క్రియేటివ్‌ హెయిర్‌ మేకోవర్, బ్రైడల్‌ ప్యాకేజెస్, గ్లోబల్‌ కలర్, వ్యాక్సింగ్, స్మూతింగ్, కెరాటిన్, మేకప్, బ్యూటీ అండ్‌ స్కిన్‌ సర్వీసెస్‌ మెన్‌ అండ్‌ ఉమెన్‌కు అందిస్తామని ఆమె వెల్లడించారు. నార్సింగ్, కోకాపేట, మణికొండ స్థానికులు మరింత అందంగా కనిపించేందుకు, వారి ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు మారియో క్లెయిర్‌ సెలూన్‌ లో ఎన్నో బెస్ట్‌ బ్యూటీ ప్యాకేజెస్‌ ఉన్నాయని నిర్వాహకురాలు స్వర్ణ అన్నారు. ఈ సెలూన్‌ ప్రారంభోత్సవంలో నటులు క్రిష్, సమీర్, అనిల్, మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Bigg Boss Celebrities at Marie Claire Salon Opening:

Marie Claire Salon Opening

Tags:   MARIE CLAIRE SALON
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ