Advertisementt

కన్నప్ప లో మహాదేవ శాస్త్రి గా మోహన్ బాబు

Fri 22nd Nov 2024 05:05 PM
mohan babu  కన్నప్ప లో మహాదేవ శాస్త్రి గా మోహన్ బాబు
Mohan Babu as Mahadeva Shastri కన్నప్ప లో మహాదేవ శాస్త్రి గా మోహన్ బాబు
Advertisement
Ads by CJ

అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్ కేటాయించి డా.మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ మూవీకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అన్ని అప్ డేట్స్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొల్పాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ దిగ్గజం మోహన్ బాబు 50 ఏళ్ల నట ప్రస్థానంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా కన్నప్ప నుంచి మంచు మోహన్ బాబు లుక్ రిలీజ్ చేశారు. 

ఈ పోస్టర్ ద్వారా కన్నప్ప సినిమాలో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు కనిపించనున్నారని స్పష్టం చేశారు. తాజాగా వదిలిన పోస్టర్ లో.. మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు గంభీరమైన లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వదిలిన పోస్టర్స్, టీజర్ మూవీపై అంచనాలు పెంచగా, తాజాగా వదిలిన మోహన్ బాబు పోస్టర్ బజ్ క్రియేట్ చేసింది. సినిమాలో ఈ క్యారెక్టర్ ఏ రేంజ్ లో ఉండనుందా? అనే క్యూరియాసిటీ నెలకొల్పింది. 

కన్నప్ప ఏ తరానికి అయినా కొత్తగానే ఉంటుందని, భక్తి భావం, ధూర్జటి మహాకవి ఎలా రాశారు? శ్రీకాళహస్తి మహత్యం ఏంటి? అన్నది ఈ చిత్రంలో చూపించబోతున్నామని ఇప్పటికే మోహన్ బాబు చెప్పడం.. అందుకు తగ్గట్టుగా కొత్త పోస్టర్స్ వదులుతుండటం కన్నప్పపై ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ చేస్తోంది. పరమేశ్వరుడు ఇచ్చిన ఆజ్ఞతోనే ఈ సినిమా తీశాం అని మోహన్ బాబు అన్నారు. ఈ సినిమాలో మోహన్ బాబు మనవడు, మంచు విష్ణు తనయుడు అవ్రామ్ సినీ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. 

ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు కన్నప్ప సినిమాపై బజ్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యారు మేకర్స్. మోహన్ బాబు నటిస్తూ నిర్మిస్తున్న ఈ సినిమాపై జనాల్లో చర్చలు నడుస్తున్నాయి. ఈ మూవీ టాలీవుడ్ లో ఓ మైలురాయి అవుతుందని చెప్పుకుంటున్నారు.

Mohan Babu as Mahadeva Shastri:

Mohan Babu as Mahadeva Shastri in Kannapa

Tags:   MOHAN BABU
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ